టాలీవుడ్ యంగ్‌టైగర్ పొలిటికల్ మ్యాటర్‌పై ఏ చిన్న విషయం వచ్చినా మీడియా సర్కిల్స్‌లో పెద్ద హాట్‌టాపిక్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యూచర్లో ఏపీ పాలిటిక్స్‌లో కింగ్ అవుతాడని రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో లెక్కలు వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా కోసం కూడా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ జనాలు చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్‌తో తాను తెరకెక్కించే సినిమాతో త్రివిక్రమ్ ఓ బిగ్ స్కెచ్ వేసినట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తీసే సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కనుందట. ఇటు త్రివిక్రమ్ సైతం ఇప్పటి వరకు తాను వెళుతున్న ఫ్యామిలీ రూటు మార్చి ఎన్టీఆర్ సినిమాతో పొలిటికల్ జానర్ వైపు మళ్లనున్నాడట.
వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే ఈ సినిమా పొలిటికల్‌గా సంచలనం క్రియేట్ చేస్తుందని, అది ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందన్న గుసగుసలు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం జైలవకుశ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుంది. ఈ లోగా 2019 ఎన్నికలు వస్తాయి. మరి ఈ టైంలో ఎన్టీఆర్ పొలిటికల్ సబ్జెక్టుతో సినిమా చేయడం అంటే అది పెద్ద సంచలనమే అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
గతంలో టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబుతో పాటు బాలయ్యకు దూరమయ్యాడు. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల వేళ పొలిటికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే అది ఎవరికి ఫ్లస్, ఎవరికి మైనస్ అవుతుందో చూడాలి.