చిరు 151పై కొత్త ట్విస్ట్‌

ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ జోష్‌తోనే చిరు త‌న 151వ సినిమాగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ధృవ‌తో హిట్ కొట్టి ట్రాక్‌లోకి వ‌చ్చిన సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్వ‌యంగా నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌పై మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాహుబ‌లి 2 రిజ‌ల్ట్ త‌ర్వాత ఈ సినిమాను మ‌రింత గ్రాండ్‌గా, భారీ బ‌డ్జెట్‌తో ఏకంగా మూడు భాష‌ల్లో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

భారీ విజువ‌ల్స్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌డంతో పాటు బాలీవుడ్‌లోను భారీ ఎత్తున రిలీజ్ చేసేలా అక్క‌డి నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఇక ఈ సినిమా టైటిల్ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి మారుతుంద‌ని స‌మాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.