ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అభిమానులకు గుడ్ న్యూస్

టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) డైరెక్ష‌న్‌లో జైల‌వ‌కుశ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాకు క‌మిట్ అయిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత ఓ సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాల డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు.

ఈ కాంబినేష‌న్ వింటేనే ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ సినీజ‌నాలు ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్‌లో మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస సూప‌ర్ హిట్ సినిమాల‌తో తిరుగులేని డైరెక్ట‌ర్‌గా మారిపోయిన కొర‌టాల శివ – ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఎన్టీఆర్ కేరీర్‌లోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్, కొర‌టాల శివ‌కు చిన్న‌ప్ప‌టి స్నేహితుడు అయిన మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు. యువ‌సుధ‌ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ మ‌హేష్‌బాబుతో భ‌ర‌త్ అను నేను సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది.