ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ ఇదే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ అంటే ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎంతో సన్నిహితులు అయిన వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. జ‌ల్సా హిట్ అయితే అత్తారింటికి దారేది ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్ అవ్వ‌డంతో పాటు ప‌వ‌న్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

2013లో వ‌చ్చిన అత్తారింటికి దారేది త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా కోసం ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ సినీజ‌నాలంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ప‌వ‌న్‌కు కూడా అత్తారింటికి దారేది త‌ర్వాత వ‌చ్చిన సినిమాలేవి స‌క్సెస్ ఇవ్వ‌లేదు. గోపాల‌…గోపాల యావ‌రేజ్. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు రూపంలో ప‌వ‌ర్ రెండు వ‌రుస డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్నాడు.

దీంతో ప‌వ‌న్‌కు ఇప్పుడు అర్జెంట్ హిట్ అవ‌స‌రం. ప‌వ‌న్ అభిమానులు కూడా త్రివిక్ర‌మ్ సినిమా మీదే పెద్ద ఆశ‌లు పెట్టుకున్నారు. లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశార‌ట‌. ” ఇంజ‌నీర్ బాబు ” టైటిల్ అయితే ట్యాగ్‌లైన్‌గా ” ఇంటి పేరు – ఒంటి పేరు అంతా ఇదే ” అని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

ప‌వ‌న్ ఈ సినిమాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా న‌టిస్తుండ‌డంతో ఈ టైటిల్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ కేరీర్‌లో 25వ మూవీగా తెర‌కెక్కుతుండ‌డంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ ఇస్తున్నాడు. వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.