బ‌ల ప్ర‌ద‌ర్శ‌న స్టార్ట్ చేసిన ఏపీ మంత్రి

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి టీడీపీలో ఎంతో సీనియ‌ర్‌, మాజీ మంత్రి…నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఎంత‌మంది ఉన్నా టీడీపీ వ‌ర‌కు ఆయ‌న‌దే రాజ్యం అన్న‌ట్టుగా ఉండేది. అలాంటి సోమిరెడ్డి ఏకంగా 2004 – 2009 – 2012 – 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా నాలుగుసార్లు ఓడిపోయినా చంద్ర‌బాబు మాత్రం వెంట‌నే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక తాజాగా కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో కూడా ఆయ‌న‌కు కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఆయ‌న స‌త్తా ఏంటో ఆయ‌న వ్య‌తిరేకుల‌కు తెలిసొచ్చింది. అది చంద్ర‌బాబు వ‌ద్ద సోమిరెడ్డి స‌త్తా.

పదమూడేళ్ల తర్వాత మంత్రి పదవి దక్కించుకున్న సోమిరెడ్డి అలా జిల్లాలో కాలుపెట్ట‌డంతోనే బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. చాలా తెలివైన వ్యూహంతో అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని వెళుతున్న‌ట్టే ఫోక‌స్ చేయ‌డంతో పాటు రెండో వైపు జిల్లాలో త‌న బ‌లం, బ‌లగం ఏంటో చూపించారు. నిన్న‌టి వ‌ర‌కు జిల్లాలో ఏకైక మంత్రిగా అంతా తానై వ్య‌వ‌హ‌రించిన మంత్రి నారాయ‌ణ‌తో పాటు మంత్రి ప‌ద‌వి కోసం సోమిరెడ్డితో పోటీప‌డ్డ ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర‌యాద‌వ్ సైతం సోమిరెడ్డి అభినంద‌న‌స‌భ‌లో ఉన్నారు.

అయితే సోమిరెడ్డికి మంత్రి ప‌ద‌వి రావ‌డం న‌చ్చ‌ని ఆనం బ్ర‌ద‌ర్స్‌తో పాటు ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి డుమ్మా కొట్టారు. వీరు ర‌క‌ర‌కాల సాకుల‌తో కావాల‌నే డుమ్మా కొట్టిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. సోమిరెడ్డి స్వయంగా ఆహ్వానించినప్పటికీ ఈ ముగ్గురు సోమిరెడ్డి అభినంద‌న స‌భ‌కు రాలేదు. ప‌దేళ్ల పాటు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో పాటు 2014లో పార్టీ గెలిచినా మంత్రి నారాయ‌ణ హ‌వా కొన‌సాగ‌డంతో సోమిరెడ్డి వీక్ అయ్యారు.

సోమిరెడ్డిని చంద్ర‌బాబు ఎమ్మెల్సీ చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీలో అంద‌రిని క‌లుపుకుని పోతూ వ‌స్తున్నారు. ఇక ఇప్పుడు సోమిరెడ్డి టైం స్టార్ట్ అయ్యింది. ఆయ‌న‌కు కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ ద‌క్కింది. నారాయ‌ణ జిల్లాలో పెత్త‌నం చేసినా ఆయ‌న ప‌ట్టుమాత్రం సాధించ‌లేక‌పోయారు. ఇక ఇప్ప‌టికే జిల్లా అంత‌టా ప‌ట్టున్న సోమిరెడ్డికి మంత్రి ప‌ద‌వి రావ‌డంతో పాటు జిల్లాలోకి మంత్రిగా ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే బ‌ల‌ప్ర‌దర్శ‌న‌తో త‌న యాంటీ వ‌ర్గానికి మింగుడుప‌డ‌ని విధంగా షాక్ ఇచ్చారు.

ఇక ఇటీవ‌ల లోక‌ల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌తో టీడీపీ అభ్య‌ర్థికి త‌క్కువ మెజార్టీ రావ‌డం, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి దెబ్బ‌కు చంద్ర‌బాబు వ‌ద్ద నారాయ‌ణ ప్ర‌యారిటీ త‌గ్గింది. ఇక ఇప్పుడు సోమిరెడ్డి మంత్రి అవ్వ‌డంతో నెల్లూరు జిల్లాలో ఆయ‌న హ‌వా స్టార్ట్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది.