పూర్ బ‌జ్‌లో చిక్కుకున్న కాట‌మ‌రాయుడు

ప‌వ‌ర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ నుంచి ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై హైప్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా రిలీజ్‌కు ముందు ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసే హంగాయా, బ‌జ్ ఆకాశంలోనే ఉంటుంది. అయితే ప‌వ‌న్ లేటెస్ట్ మూవీ కామ‌ట‌రాయుడు విష‌యంలో మాత్రం చాలా చాలా స్త‌బ్ద‌త క‌నిపిస్తోంది. గ‌తంలో ప‌వ‌న్ ప్ర‌మోష‌న్లు ప‌ట్టించుకునేవాడు కాదు. గ‌బ్బ‌ర్‌సింగ్ నుంచి ఛానెల్స్‌కు ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక ప‌వ‌న్ సినిమా రిలీజ్ అంటే మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను వార్త‌లు కుప్పులు తెప్పులుగా వ‌స్తాయి.

కానీ కాట‌మ‌రాయుడు విష‌యంలో ఇటు మీడియా, వెబ్‌సైట్లలో పెద్ద‌గా వార్త‌లు ఏం క‌న‌ప‌డ‌డం లేదు. సినిమా రిలీజ్‌కు రెండు రోజులే టైం ఉంది. ఇటు ప‌వ‌న్ కూడా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం లేదు. క‌నీసం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ త‌ర్వాత అయినా సినిమాకు భారీ హైప్ వ‌స్తుంద‌నుకుంటే క‌నీసం ఫ్యాన్స్ కూడా పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు.

టీజ‌ర్ మాత్రం కోటి వ్యూస్‌తో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీనిని ప‌క్క‌న పెడితే ఆడియోలో మిరా మిరా మీసం మిన‌హా మిగిలిన పాట‌లపై ఫ్యాన్సే పెద‌వి విరుస్తున్నారు. ట్రైలర్‌ వచ్చిందిగానీ.. ‘బాహుబలి-2’ మేనియా ముందు కొట్టుకుపోయింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా బాహుబ‌లి 2 ట్రైల‌ర్ మీద ఆస‌క్తి చూపుతున్నారే త‌ప్ప కాట‌మ‌రాయుడు గురించి ఎక్కడా మాట్లాడ‌డం లేదు.

మ‌రో రెండు రోజుల్లో కాట‌మ‌రాయుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ప‌బ్లిసిటీ చాలా వీక్‌గా ఉంది. మ‌రో వైపు బిజినెస్ భారీగానే జ‌రిగింది. కోలీవుడ్ హిట్ మూవీ వీర‌మ్‌కు రీమేక్‌గా వ‌స్తుండ‌డంతో పాటు క‌థ అంత గొప్ప‌ది కాక‌పోవ‌డం, మాస్ సినిమా అవ్వ‌డం, మ‌రీ గొప్ప హిట్లు లేని డాలి డైరెక్ష‌న్ కావ‌డం కాట‌మ‌రాయుడుకు మైన‌స్‌గా మారాయి.

ఇక ఇప్ప‌టికే వీరుడొక్క‌డే పేరుతో ఆల్రెడీ తెలుగులో డ‌బ్ అయిన సినిమాను తిరిగి కాట‌మ‌రాయుడుగా డ‌బ్ చేస్తుండ‌డంతో ఈ సినిమాను ప‌వ‌న్ ఫ్యాన్సే లైట్ తీస్కొంటున్నారు. అందుకే కాట‌మ‌రాయుడు పూర్ బ‌జ్‌తో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మ‌రి ఈ రెండు రోజుల్లో అయినా భారీ హైప్ వ‌స్తుందేమో చూడాలి.