ర‌వితేజ‌ను ఆ డైరెక్ట‌ర్ ఆదుకుంటాడా..!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కేరీర్ ఇప్పుడు గంద‌ర‌గోళంగా ఉంది. 2015లో కిక్ 2, బెంగాల్ టైగ‌ర్ సినిమాల త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ తెర‌మీద క‌న‌ప‌డేదు. 2016లో ర‌వితేజ సినిమా డైరీ ఖాళీగా ఉంది. 2017లో అయినా ర‌వితేజ సినిమా వ‌స్తుందా ? లేదా ? అన్న‌ది ఇంకా గ్యారెంటీ లేదు. ర‌వితేజ మూడు నాలుగు ప్రాజెక్టుల సిట్టింగ్‌లో కూర్చున్నా ఏవీ ఇంకా ఓకే అవ్వలేదు.

ర‌వితేజ మార్కెట్ చాలా డౌన్ అయిపోవ‌డంతో మ‌నోడి మీద భారీ బడ్జెట్‌తో రిస్క్ చేసేందుకు ఎవ్వ‌రూ రెడీ అవ్వ‌డం లేదు. ర‌వితేజ కంటే నాని, రాజ్ త‌రుణ్, విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి హీరోల వైపు ఇప్పుడు ప్రొడ్యుస‌ర్లు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే ర‌వితేజతో సినిమా కోసం ఇప్పుడు ఓ హిట్ డైరెక్ట‌ర్ రెడీ అవుతున్న‌ట్టు టాలీవుడ్ ఇన్న‌ర్ టాక్‌.

గ‌తంలో ర‌వితేజ‌తో డాన్ శీను, బలుపు రెండు హిట్ సినిమాలు తీసిన మ‌లినేని గోపీచంద్ మ‌రోసారి ర‌వితేజ‌తో సినిమా చేసి త‌మ కాంబోలో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం మ‌లినేని సాయిధ‌ర‌మ్ తేజ్‌తో విన్న‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

కోలీవుడ్‌లో హిట్ అయిన సేతుపతిని తెలుగులోకి తీసుకు రావాలని వీరు ప్లాన్‌లో ఉన్నారు. మ‌రి ఈ కాంబోలో ఈ సినిమా హిట్ కొట్టి ర‌వితేజ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తాడ‌ని ఆశిద్దాం. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.