ఖైదీ 150 ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతో

9 సంవ‌త్స‌రాల త‌ర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వెండితెరంగ్రేటం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వర్షం కురిపిస్తోంది. చిరు తొమ్మిదేళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్నా త‌న‌లోని ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించుకున్నాడు. చిరు ఖైదీ నెంబ‌ర్ 150 స‌క్సెస్ ఫుల్‌గా ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.

తొలి రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.47 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఫస్ట్ వీక్ టోటల్ గ్రాస్ కలెక్షన్లు 108.48 కోట్లు సాధించింది. ఈ సినిమా వ‌సూళ్ల వివ‌రాలు చెప్పిన అల్లు అర‌వింద్ ఖైదీ ఏడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు రాబట్టిందని ఆయ‌న చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు సాధించిన ఖైదీ వసూళ్లు కర్ణాటకలో రూ.9 కోట్లు, తమిళనాడులో రూ.60 లక్షలు, అమెరికాలో రూ.17 కోట్లు రాబట్టింది. రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో రూ.3.90 కోట్లు కలెక్ట్ చేసింది.

ఏరియాలా వారీగా ఖైదీ నెంబ‌ర్ 150 ఫ‌స్ట్ వీక్ షేర్ :

నైజాం: 14.07

సీడెడ్: 10.82

నెల్లూరు: 2.42

గుంటూరు: 5.51

కృష్ణా: 4.13

వెస్ట్ గోదావరి: 4.87

ఈస్ట్ గోదావరి: 6.29

ఉత్తరాంధ్ర: 8.16

—————————————————-

తెలంగాణ + ఏపీ షేర్ = రూ. 56.45 కోట్లు

—————————————————-

టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = రూ. 77.31 కోట్లు