ప‌వ‌న్‌ డైరెక్ట‌ర్‌కి ఎన్టీఆర్ బంపర్ ఆఫ‌ర్‌

వ‌రుసగా హ్యాట్రిక్ విజ‌యాలు అందుకున్నా.. ఇప్ప‌టికీ యంగ్ టైగ‌ర్ త‌దుప‌రి సినిమాపై క్లారిటీ రాలేదు. అగ్ర ద‌ర్శ‌కుల నుంచి చిన్న ద‌ర్శకులు ఎంతోమంది చెప్పిన క‌థ‌లు వింటున్నా ఒక్క‌దానికీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డం లేదు! అయితే ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ల హ‌వా న‌డుస్తున్న త‌రుణంలో అగ్ర‌ద‌ర్శ‌కుల‌కు బ‌దులు చిన్న డైరెక్ట‌ర్ల‌తోనే సినిమా చేయాల‌ని తార‌క్ డిసైడ్ అయ్యాడు! అందుకే ఒక  యంగ్ డైరెక్ట‌ర్ క‌థ‌ను ఓకే చేశాడు. కేవలం రెండు సినిమాలే చేసినా.. ఆ ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌క‌ముంచి అవ‌కాశం ఇచ్చాడు.

యంగ్ టైగ‌ర్‌ను మెప్పించిన ఆదర్శ‌కుడు మ‌రెవరో కాదు బాబి. బాబి తీసిన‌వి రెండే రెండు సినిమాలు! అందులో ఒక‌టి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో..!! అయినా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ నిరుత్సాహ ప‌రిచింది. దీంతో ఇక బాబి ప‌ని అయిపోయింద‌నుకున్నారు. అయితే స‌ర్దార్ పరాజ‌యం ప‌వ‌న్ ఖాతాలోకి వెళిపోవ‌డంతో కొంత వ‌ర‌కూ సేఫ్ అయ్యాడు బాబి. ఇక మ‌రోప‌క్క యంగ్ టైగ‌ర్ కూడా క‌థ‌ల ఎంపిక‌లో జాగ్ర‌త్త వ‌హిస్తున్నాడు.

కెరీర్ ఎన్న‌డూ లేనంత‌ పీక్ స్టేజ్‌లో ఉండ‌టంతో ద‌ర్శ‌కుల విష‌యంలో అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అనుకున్నారు. త‌ర్వాత ‘సుప్రీమ్’ వంటి హిట్ అందుకున్న అనీల్ రావిపూడి కూడా యంగ్ టైగర్ కు కథకు ఓకే అనేశాడని, త్వరలోనే వీరి కాంబో సెట్స్ పైకి వెళ్ళడమే తరువాయని అనుకున్నారంతా. కానీ ఇంతలోనే నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతలో ఒక ‘పవర్’ ఫుల్ స్టోరీతో ఎన్టీఆర్ తో సిట్టింగ్ వేశాడు బాబీ. క‌థ నచ్చిన ఎన్టీఆర్‌ నువ్వెళ్ళి మిగతా పనులు చూడు అని బాబీకి చెప్పాడట. కేవలం రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబీకి మనోడు ఓకే అన్నాడంటే..ఆ స్టోరీ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్ధంచేసుకోవచ్చు. మొత్తానికి బాబీ న‌క్కతోక తొక్క‌డాని, మూడో సినిమాకే ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడ‌ని టాక్‌!!