చిరు 151వ సినిమా హీరోయిన్‌పై షాకింగ్ న్యూస్‌

మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ దొరకడం ఎంత కష్టమో చిరు 150వ సినిమా హీరోయిన్ ఎంపిక కోసం ఆ సినిమా యూనిట్ ప‌డిన క‌ష్టాలు చూస్తేనే మ‌న‌కు తెలుస్తుంది. చిరు కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమాలో హీరోయిన్ కోసం ఈ సినిమా యూనిట్ నానా క‌ష్టాలు ప‌డింది. ఎట్టకేలకు రామ్ చరణ్ తన పీఆర్ అంతా ఉపయోగించి, కాజల్ ను ఎలాగోలా బుజ్జగించి లైన్లో పెట్టాడు. ప్రస్తుతానికైతే కాజల్ ఫిక్స్ అయిపోయింది.

ఈ సినిమా వ‌ర‌కు గండం గ‌డిచింది. మ‌రి చిరు – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే చిరు 151వ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు అన్న ప్ర‌శ్న‌కు మ‌ళ్లీ హీరోయిన్ స‌మ‌స్య త‌ప్పేలా లేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మ‌రోసారి కాజ‌ల్‌ను రిపీట్ చేస్తార‌న్న టాక్ వ‌చ్చినా చిరు మాత్రం మ‌ళ్లీ కాజ‌లే హీరోయిన్ అంటే బోర్ కొడుతుంద‌ని వెన‌క్కు త‌గ్గుతున్నాడ‌ట‌.

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష పేరు లైన్‌లోకి వ‌చ్చింది. ఇప్పటికే సీనియర్ల సరసన నటించిన అనుభవం ఉన్న త్రిషను తన 151వ ప్రాజెక్టు కోసం తీసుకోవాలని చిరంజీవి అనుకుంటున్నాడు. పైగా చిరంజీవితో గతంలో నటించిన అనుభవం కూడా త్రిషకు ఉంది. చిరు స్టాలిన్ మూవీలో త్రిష హీరోయిన్‌.

ఇక సీనియ‌ర్ హీరోల‌లో గ‌తేడాది బాల‌య్య ప‌క్క‌న త్రిష ల‌య‌న్ సినిమాలో న‌టించింది. ఇక ఈ సినిమాలో త్రిష‌కు ఛాన్స్ వ‌స్తే ప్రస్తుతం అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న త్రిషకు ఇది గొప్ప ఛాన్స్. సో ఈ సినిమాకు కూడా చిరు ఎలాగోలా క‌ష్ట‌ప‌డి త్రిష‌కు ఛాన్స్ ఇచ్చి హీరోయిన్ గండం గ‌ట్టెక్క‌వ‌చ్చు.