చెర్రీకి నో…ప‌వ‌న్‌కు ఎస్‌

చెర్రీకి నో ఏంటి…ప‌వ‌న్‌కు ఓకే ఏంటి ఈ హెడ్డింగ్ కాస్త షాకింగ్‌గా ఉందే అనుకుంటున్నారా…ఎస్ ఇది నిజ‌మే. సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా ఉన్న ‘వై దిస్ కొలవెరీ..కొలవెరీ..కొలవెరీ డి…’ ఫేం అనిరుధ్ ఈ ఒక్క  పాట‌తోనే సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. ఆ పాట అంద‌రి నోళ్ల‌లో ఎంతలా మార్మోగిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ పాడిన ఆ పాటను కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేశాడు.

ఆ ఒక్క పాట‌తో అనిరుధ్ రేంజ్ మారిపోయింది, క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఆ త‌ర్వాత అనిరుధ్ కోలీవుడ్‌లో ఎంద‌రో పెద్ద హీరోల సినిమాల‌కు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అయితే అనిరుధ్‌కు తెలుగులో సైతం కొన్ని ఛాన్సులు వ‌చ్చినా అవి చేజారిపోయాయి. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన రామ్‌చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాకు తొలుత అనిరుధ్‌నే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు. ఆ త‌ర్వాత చివ‌రి నిమిషంలో ఈ ప్రాజెక్టులోకి థ‌మ‌న్ వ‌చ్చి చేరాడు.

ఇక త్రివిక్రమ్ ‘అ..ఆ..’ సినిమాకు ఆఫర్ వచ్చినా.. సైన్ చేసినా చివరి నిముషంలో వదిలేశాడు. ఆ సినిమాకు అడ్వాన్స్‌గా కొంత మొత్తం కూడా తీసుకున్నాడు అనిరుధ్. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ సినిమాతోనే అనిరుధ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడ‌ని స‌మాచారం. త్రివిక్ర‌మ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో తీసే నెక్ట్స్ సినిమాకు అనిరుధ్‌నే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స్ చేశాడ‌ట‌.

పవన్ సినిమా అనగానే అడిగిన వెంటనే ఓకే చెప్పేశాడట అనిరుధ్. ఈ క్రేజీ కాంబినేష‌న్ దాదాపు సెట్ అయ్యింద‌న్న టాక్‌తో అనిరుధ్ మొత్తానికి కొడుకు చెర్రీకి షాక్ ఇచ్చి…బాబాయ్ ప‌వ‌న్‌కు భ‌లే ఓకే చెప్పాడే అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.