పెళ్లి కుదిరినా స‌మంత ఎక్స్‌పోజింగ్ వెన‌క సీక్రెట్

ఈ ఫొటో చూస్తే చాలా సందేహాలు వ‌చ్చేస్తాయి. చెన్నై బ్యూటీ సమంత కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా హాట్‌గా కనిపించింది లేదు. ఉన్నంతలో కాస్తంత పద్ధతిగానే కనిపించింది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం వెలుగులోకి వచ్చిన తర్వాత విడుదలైన సినిమాలు చూస్తే మాత్రం ఆమె రెచ్చిపోయి మ‌రీ గ్లామ‌ర్ తెగ ఒల‌క బోసేసింది.

అంత‌కు ముందు అల్లుడు శీను లాంటి ఒక‌టి అరా సినిమాల్లో తొడ‌లు క‌నిపంచేలా పిచ్చ పిచ్చ‌గా అందాలు ఆర‌బోసిన స‌మంత చైతుతో స‌మంత ప్రేమాయ‌ణం న‌డుస్తుండ‌గా రిలీజ్ అయిన ‘అఆ’, ‘బ్రహ్మోత్సవం’, ‘జనతాగ్యారేజ్‌’లో కాస్త డోస్ పెంచేసింది. గ్యారేజ్‌లో అయితే తొడ‌లు మ‌రీ పైకి క‌నిపించేలా డ్రెస్సులు వేసుకుని డ్యాన్సులు చేసింది.

ఇక తాజాగా ఆమె ఓ పత్రిక కోసం చేసిన ఫోటో షూట్‌లో మాత్రం హాట్‌నెస్‌ డోస్‌ పెంచేసింది. ఓ ప‌క్క చైతుతో వ‌చ్చే యేడాదే స‌మంత పెళ్లి జ‌ర‌గ‌నుంది. మ‌రి ఈ టైంలో స‌మంత ఇంత‌లా రెచ్చిపోవ‌డానికి కార‌ణం ఏంటా అని సినీ జ‌నాలు ఆరా తీస్తే అస‌లు మ్యాట‌ర్ బ‌య‌ట‌ప‌డింది.

నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ప్రకటించింది సమంత. చైతు సైతం స‌మంత పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తుంద‌ని ఎనౌన్స్ చేశాడు. పెళ్ల‌య్యాక సినిమాల్లో న‌టిస్తానంటే చాలా ప‌ద్ధ‌తిగా చేస్తుందేమో అన్న భ్ర‌మ‌ల్లో అంద‌రూ ప‌డిపోతారు. కానీ పెళ్ల‌యినా తాను మాత్రం ఎక్స్‌పోజింగ్‌కు, గ్లామ‌ర్ ఒల‌క‌బోసేందుకు ఏ మాత్రం రాజీప‌డ‌ను అన్న సంకేతాలు బ‌లంగా పంపేందుకే ఆమె ఇంత హాట్‌నెస్‌గా పోజులు ఇస్తోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలా ఉండ‌క‌పోతే ఛాన్సులు ఎవ‌రు ఇస్తారు..!