చిరు వ‌ర్సెస్ బాల‌య్య గెలుపెవ‌రిది..!

2017 సంక్రాంతి బ‌రిలో దిగుతున్న బాల‌య్య‌, చిరు గ్రాండ్ మూవీల‌పై పెద్ద ఎత్తున అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఖైదీ నెంబ‌ర్ 150 పేరుతో చిరు, చారిత్ర‌క నేప‌థ్యంలో ఓ వీరుడి క‌థ‌తో గౌత‌మీపుత్ర‌గా బాల‌య్య తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైపోతున్నారు. అయితే, ఇప్పుడు తాజాగా గౌత‌మీ పుత్ర టీజ‌ర్ విడుద‌లైంది. దీనిని చూశాక మాత్రం.. బాల‌య్య అభిమానుల్లో అంచ‌నాలు మ‌రింత‌గా డ‌బుల్ అయ్యాయి. గౌత‌మీపుత్ర టీజ‌ర్‌లో బాల‌య్య లుక్ అద్బుతంగా ఉందంటున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్ శాతకర్ణిగా బాలయ్యను అభిమానులు ఎలా చూడాలని కోరుకున్నారో అంతకు మించి చూపాడు.

బాలయ్య కూడా రెట్టించిన ఉత్సాహంతో, వయసును మర్చిపోయి రాజసం, రౌద్రం కలగలిసిన అభినయాన్ని చూపించాడు. శ‌ర‌ణ‌మా… ? ర‌ణ‌మా.. ? అంటూ ఆయ‌న ప‌లికిన డైలాగ్ కూడా బాగుంది. ఇక‌, డిజిట‌ల్ ఎఫెక్ట్స్ కూడా అధిరిపోయాయ‌నే టాక్ వ‌స్తోంది. జ‌క్క‌న్న బాహుబ‌లి రేంజ్‌లో ఈ మూవీ ఉంద‌ని బాల‌య్య అభిమానులు అంటున్నారు. దీంతో ఈ మూవీపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇక‌, చిరు మూవీ విష‌యానికి వ‌స్తే.. ఆయనకు ముఖ్య బలమైన మాస్ ఇమేజ్ తో వస్తున్న చిత్రం ఖైదీ నం.150.  ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ అభిమానుల్లో, చిత్ర యూనిట్ లో ఎక్కడో ఏదో సందేహం.

పైగా చిరు మూవీలో కొత్తదనమంటూ  ఏమీ లేదనే టాక్ ఒకటి బ‌య‌లు దేరింది. రీమేక్ చేస్తున్న చిత్రం. సినిమా మొత్తం చిరంజీవి ఛరీష్మా మీదే నడవాలి. అందుకే ఏదైనా చిన్న తేడా జరిగినా ఈ సంక్రాంతి విజేతగా బాలయ్య నిలబడే చాన్సులెక్కువున్నట్టు కనిపిస్తున్నాయి.  అయితే, త్వ‌ర‌లోనే చిరు మూవీ టీజ‌ర్ కూడా వ‌చ్చే ఛాన్స్ ఉంది. దీనిని చూశాక కానీ డిసైడ్ చేయ‌లేం. ఏదేమైనా ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య శాత‌క‌ర్ణి టీజ‌ర్ మాత్రం అద‌ర‌గొట్టింద‌నే చెప్పాలి. మ‌రి సంక్రాంతి బ‌రిలో చిరును బాల‌య్య ఓడిస్తాడా?  లేక చిరు గెలుస్తాడా?  తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.