హోమ్లీ బ్యూటీ స్విమ్మింగ్‌ టిప్స్‌

పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే ముద్దుగుమ్మ స్నేహ. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. కానీ స్టార్‌డమ్‌ మాత్రం రాలేదు అమ్మడికి. ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌కి స్నేహ పక్కాగా సెట్‌ అవుతుంది. ‘శ్రీరామదాసు’ సినిమాలో రామదాసు భార్యగా స్నేహ పాత్ర అమోఘం. ఇలా చాల ట్రెడిషనల్‌ పాత్రల్లో స్నేహ నటన అద్భుతంగా ఉంటుంది. అలాంటి స్నేహ పెళ్లి చేసుకుని సినిమాలకు తాత్కాలికంగా దూరం అయ్యింది.

అయితే ఈ మధ్యే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. తన తోటి హీరోయిన్లు, తన కన్నా సీనియర్‌ హీరోయిన్లు కూడా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అదరహో అన్పిస్తున్నారు. ఇటీవల స్నేహ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్రకు భార్యగా నటించింది. కర్నూలు యాసతో మాట్లాడుతూ వావ్‌ అన్పించింది. అయితే తాజాగా మలయాళంలో ఒక సినిమాలో నటిస్తోందట స్నేహ. మలయాళ్‌ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో స్నేహ హీరోయిన్‌గా నటించనుందట.

తాజాగా తెలుగులో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోన్న ‘మనమంతా’ సినిమాలోని గౌతమి తరహా పాత్రలో స్నేహ నటిస్తోందట ఈ సినిమాలో. మంచి పాత్రలు వస్తే తెలుగులోనూ, తమిళంలోనూ కూడా అన్ని రకాల పాత్రలు చేయడానికి ముద్దుగుమ్మ స్నేహ రెడీగా ఉన్నానంటోంది. అంతేకాదు ఇంత వయసులోనూ అంత స్లిమ్‌గా ఉన్న తన నాజూకు సౌందర్యానికి బెస్ట్‌ రీజన్‌ ఏంటంటే స్విమ్మింగ్‌ అని సింపుల్‌గా చెప్పేస్తోంది స్నేహ. మరింకేం స్నేహ చెప్పిన ఈ సింపుల్‌ టిప్‌ ఫాలో అవ్వండి మరి బొద్దుగుమ్మలూ!