సిక్స్‌ ప్యాక్‌తో చితక్కొట్టేశాడు

చాలా మంది హీరోలు సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేశారు. వారిలో యంగ్‌ హీరోలు సైతం ఉన్నారు. అయితే నందమూరి వారసుడు కళ్యాణ్‌రామ్‌ మాత్రం ఇంతవరకూ ఈ సిక్స్‌ ప్యాక్‌ జోలికి పోలేదు. కానీ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇజం’ సినిమా కోసం తొలిసారిగా కళ్యాణ్‌ రామ్‌ సిక్స్‌ పాక్‌ ట్రై చేశాడు.

సెప్టెంబర్‌ 2 హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ పాక్‌లో ఉన్న పోస్టర్‌ని విడుదల చేశారు. ‘పటాస్‌’ సినిమాతో విజయం అందుకున్నాడు కళ్యాణ్‌రామ్‌. ఈ సినిమా తరువాత నుండీ జోరు పెంచాడు అనుకున్నారంతా. కానీ ఆ వెంటనే ‘షేర్‌’ సినిమాతో బోర్లా పడ్డాడు. కానీ తేరుకుని పూరీతో సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా పైనే పూరీ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ అద్భుతమైన నటనను కనబరిచాడట. మాస్‌ అప్పీల్‌లో కళ్యాణ్‌రామ్‌ లుక్స్‌ అదిరిపోతున్నాయి.

గతంలో ఈ సినిమాకి సంబంధించి ఒక లుక్‌ని విడుదల చేశారు. తాజాగా విడుదలైన న్యూలుక్‌లో కళ్యాణ్‌రామ్‌ వావ్‌ అన్పిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కళ్యాణ్‌రామ్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్‌ హిట్‌ కొట్టాలని ఆశిద్దాం.