సక్సెస్‌తోపాటు రెస్పెక్ట్‌ దక్కింది.

కొన్ని సినిమాలకు కేవలం సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ దక్కుతుంటుంది. కొన్ని సినిమాలు దారుణమైన విమర్శల్ని ఎదుర్కొంటాయి. కొన్ని సినిమాలకు ప్రశంసలు దక్కుతాయి. చాలా అరుదుగా మాత్రమే కొన్ని సినిమాలకు గౌరవం దక్కుతుంది. అలాంటి సినిమాల జాబితాలో ‘జ్యో అచ్యుతానంద’ సినిమా చేరుతుంది. ‘సినిమా విజయవంతమైంది. దానికి మించి ఎక్కడికి వెళ్ళినా సినిమాకీ, మాకూ రెస్పెక్ట్‌ దక్కుతోంది..’ అంటున్నాడు ‘జ్యో అచ్యుతానంద’ చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌. మంచి సినిమాకి ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలతోపాటు గౌరవం దక్కుతుంటుంది. ‘జ్యో అచ్యుతానంద’ కూడా అంతే.

నారా రోహిత్‌, నాగశౌర్య నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రెజినా నటించింది. ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. మధ్యలో ఓ అమ్మాయి. అలా ముగ్గురు వ్యక్తుల కథ ఇది. అత్యద్భుతంగా దర్శకుడు సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ళు రెస్ట్‌ తీసుకోవాలనుకుంటున్నాడట దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల. హీరో నాగశౌర్యతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌ టూర్‌కి వెళతానంటున్నాడు ఆ రెస్ట్‌లో భాగంగా. కమెడియన్‌గా, నటుడిగా తెరపై కనిపిస్తూనే, అప్పుడప్పుడూ దర్శకుడిగానూ సినిమాలు చేస్తుంటానని చెబుతున్న అవసరాల శ్రీనివాస్‌, నానితో త్వరలో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట.