‘ఈడు గోల్డ్‌ ఎహె’ ఊర మాస్‌.

తాజాగా ‘జక్కన్న’ సినిమాతో విజయం అందుకుని మాంచి జోష్‌ మీదున్నాడు సునీల్‌. తాజాగా సునీల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ ఎహే’. పేరుకి కామెడీ హీరోనే అయినా, సునీల్‌ డాన్సుల్లో మాత్రం మహా మాస్‌. అందుకే ఊర మాస్‌ డాన్సులతో ఊపేయనున్నాడు ఈ సినిమాలో ఈ భీమవరం బుల్లోడు. డాన్సులంటే మనోడికి కొట్టిన పిండి. కామెడీ టైమింగ్‌లో సునీల్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? మాంఛి కమర్షియల్‌ మాస్‌ మసాలా సినిమాని సునీల్‌తో వీరు పొట్ల తెరకెక్కించాడని సమాచారమ్‌.

ఇందులో సునీల్‌ పెర్ఫామెన్స్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుందట. ఇంతవరకూ సునీల్‌ చేసిన సినిమాలన్నింటి కన్నా ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందట. కథా, కథనాలను తెరకెక్కించిన విధానం చాలా ప్రత్యేకంగా ఉండబోతోందట. ఇప్పటికే టైటిల్‌తోనే ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు సునీల్‌. అంతేకాదు ఈ సినిమాలో సునీల్‌ క్యారెక్టరైజేషన్‌ విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.

ఈ సినిమాలో సునీల్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడనే టాక్‌ కూడా వినవస్తోంది. అది కూడా పాజిటివ్‌ అండ్‌ నెగిటివ్‌ రోల్స్‌ అని కూడా తెలియ వస్తోంది. సుష్మారాజ్‌, రిచా పనయ్‌ గ్లామర్‌ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. అక్టోబర్‌ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.