మెగాస్టార్‌ సినిమాలో ఎమ్మెల్యే స్పెషల్‌!

ఎమ్మెల్యే కేథరీన్‌ ట్రెసా మెగాస్టార్‌తో ఆడిపాడనుంది. ‘ఖైదీ నెంబర్‌ 786’ సినిమాలో కేథరీన్‌ నటిస్తోందని సమాచారమ్‌. అల్లు అర్జున్‌ ఆమెకు ఈ ఆఫర్‌ ఇప్పించాడని సమాచారమ్‌. బన్నీకి ఈ అమ్మడితో మంచి స్నేహం ఉంది. ఇప్పటికూ తన ప్రతీ సినిమాలోనూ ఛాన్సుంటే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తూ ఉంటాడు. అలాగే అల్లు అర్జున్‌తో కేథరీన్‌ ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. ‘యూ ఆర్‌ మై ఎమ్మెల్యే’ అంటూ ‘సరైనోడు’ సినిమాలో పాటేసుకున్నాడు కేథరీన్‌తో అల్లు అర్జున్‌. ఆమెతో ‘టాపు లేచిపోద్ది’ అనే సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అల్లు అర్జున్‌కి ఉంది. ‘రుద్రమదేవి’ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.

కానీ ఇద్దరికీ కంబైండ్‌ సీన్‌నస అయితే లేవు. గానీ ఆ సినిమాలో ఆఫర్‌ మాత్రం అల్లు అర్జున్‌ వల్లే వచ్చిందని టాక్‌ కూడా ఉంది. మొత్తానికి ఈ అమ్మడికి డైరెక్ట్‌గా అవకాశాలు కరువైనప్పటికీ బన్నీ రూపంలో బెస్ట్‌ ఆఫర్‌నస మాత్రం బాగానే వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మెగాస్టార్‌ సినిమాలో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిందంటున్నారు ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు. చిరంజీవి సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ అయితే కేథరీన్‌కి సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ ఒకటి ప్లాన్‌ చేస్తున్నాడట. సాంగ్‌ ఒకటే కాకుండా మూడు నాలుగు సీన్స్‌ కూడా ఉంటాయని సమాచారమ్‌. ఈ ఆఫర్‌ మాత్రం కేథరీన్‌కి గోల్డెన్‌ ఆఫరే అనాలి.