జనసేన టు జిమ్:పవన్ కళ్యాణ్

ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో మళ్ళీ రాజకీయ బాట పట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ రెండు భారీ బహిరంగ సభలతో జనసేన ఉనికిని చాటుకున్నాడు.అయితే తదుపరి రాజకీయ కార్యాచరణ మాత్రం పవన్ ప్రకటించ లేదు.అయితే ఈ లోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా పనుల్లో బిజి బిజీ గా వున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా కాటమ రాయుడు గా రాబోతోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు గోపాల-గోపాల ఫేం కిశోర్ పార్థసాని దర్శకత్వం వహిస్తుండగా పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ నెల 20 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.అయితే పవన్ మాత్రం ఈ నెల 24 నుండి షూటింగ్ లో కాటమ రాయుడు గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే కాటమ రాయుడు సినిమాకి రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉండడం, దానికి మంచి దేహ దారుఢ్యం కావాల్సి ఉండడంతో పవన్ జిమ్ లో కాటమ రాయుడు కోసం కసరత్తులు మొదలుపెట్టాడు.అలా కసరత్తులు చేస్తూ జిమ్ లో ఉల్లాసంగా బయటికొస్తున్న పవన్ పిక్ ఒకటి సోష మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆప్పుడెప్పుడో తమ్ముడు సినిమాలో పవన్ చేసిన కసరత్తులు వెండి తెరపై కనక వర్షం కురిపించాయి.మల్లి ఇన్నాళ్లకు పవన్ కాటమరాయుడి కసరత్తులు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి మరి.