‘కాటమరాయుడు’తో పవన్‌ విశ్వరూపమే.

‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాతో నిరాశ పరిచిన పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కాటమరాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’ అంటూ జోరుగా సాగే ఈ పాట చాలా పాపులర్‌ అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఆలపించిన ఈ పాట వీడియోలు కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ఇప్పుడు ఆ పాటలోని మొదటి లైన్‌నే తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు పవన్‌ కళ్యాణ్‌. ఈ టైటిల్‌ ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది.

అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది.పవన్‌తో ‘గోపాల గోపాల’ సినిమాను డైరెక్ట్‌ చేసిన డాలీనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌ డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించనున్నాడని సమాచారమ్‌. అక్కడక్కడా మెరిసిన జుట్టు, గెడ్డంతో, పంచెకట్టుతో కనిపించనున్నాడనీ వినికిడి. ఫ్యాక్షన్‌ లవ్‌ స్టోరీ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్‌ విషయంలో స్టార్‌ డైరెక్టర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హ్యాండ్‌ కూడా ఉన్నదని సమాచారమ్‌. మొత్తానికి ఈ సినిమాను చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.