సుకుమార్‌తో అల్లు శిరీష్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. అయితే ఇప్పుడు సుకుమార్‌ దృష్టి అల్లు శిరీష్‌పై పడింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో అల్లు శిరీష్‌ నటనకు చాలా ఇంప్రెస్‌ అయ్యాడట సుకుమార్‌. ఆ సినిమా చూసినప్పటి నుండీ శిరీష్‌తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ మధ్య సుకుమార్‌ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు.

అలాగే ఈ సినిమాకు తాను నిర్మాతగా మారి, దర్శకత్వ విభాగాన్ని మరొకరికి అప్పగించే యోచనలో ఉన్నాడట. తన వద్ధ అసిస్టెంట్‌గా పని చేసిన ఒక యంగ్‌ డైరెక్టర్‌కి ఈ బాధ్యతను అప్పగించే ప్లాన్‌ చేస్తున్నాడట సుక్కు. శిరీష్‌ తొలి సినిమా ‘గౌరవం’ నుండీ తనలోని నటనను మెట్టు మెట్టుగా ప్రదర్శిస్తూ వస్తున్నాడు. సినిమా సినిమాకీ లోపాల్ని సరి చేసుకుంటున్నాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో పూర్తి నటుడిగా పరిణీతి చెందాడు. కేవలం నటన పరంగానే కాకుండా, డాన్సులు ఇతరత్రా టాలెంట్స్‌లో కూడా శిరీష్‌ తనదైన శైలి ప్రదర్శిస్తున్నాడు.

అందుకే శిరీష్‌ని తన స్టైల్‌ హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడట సుకుమార్‌. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదికెళ్లనుందని సమాచారమ్‌. ఇదే కనుక జరిగితే హీరోగా మరో గుడ్‌ స్టాంప్‌ వేయించుకుంటాడు శిరీష్‌. సుకుమార్‌ అంటేనే విలక్షణత. దర్శకుడైనా, నిర్మాత అయినా సుకుమార్‌ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. సో ఆల్‌ ది బెస్ట్‌ టు శిరీష్‌.