మెగాస్టార్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌

మెగాస్టార్‌ సినిమాకి మరో స్పెషల్‌ యాడ్‌ కానుంది. తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌గానీ, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కానీ చిరు సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించే అవకాశం ఉందట. ఈ ఇద్దరు సూపర్‌ స్టార్లు చిరంజీవికి మంచి సన్నిహితులు. చిరంజీవి రీ ఎంట్రీలో తమ ఎంట్రీ ఒక స్పెషల్‌ టచ్‌గా ఉండబోతోందంటే అందుకు తాము రెడీ అంటున్నారనే గాసిప్‌ విన వస్తోంది.

‘మనం’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. తెలుగు ప్రేక్షకుల్లో అమితాబ్‌ బచ్చన్‌ అంటే చాలా అభిమానించే వాళ్లు ఉన్నారు. అలాగే ఇక రజనీకాంత్‌ గురించి వేరే చెప్పనక్కర్లేదు. అందుకే చిరు సినిమాకి వీరి అప్పియరెన్స్‌ మరింత గ్లామర్‌ కానుందని భావిస్తున్నారు. అయితే వీరిద్దరూ కనిపిస్తారా? లేక ఎవరో ఒకరు కనిపిస్తారా అనేది సస్పెన్స్‌. కానీ ఎవరో ఒకరు అయితే మాత్రం కనిపిస్తారని సమాచారమ్‌.

వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాంచరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బ్యూటిఫుల్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో ఉన్నారు. సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా డాన్సు ప్రాక్టీసులు చేస్తున్నాడు. ఇంత వయసులో కూడా చిరంజీవి ఫుల్‌ గ్రేస్‌తో డాన్సులు చేయనున్నాడట. ప్రభుదేవా, లారెన్స్‌లు చిరు కోసం ఈ సినిమాకి కొరియోగ్రాఫర్లుగా పని చేస్తున్నారు.