వర్కవుట్స్‌ మొదలు పెట్టిన వెంకటేష్‌

వెంకీ తాజా సినిమా ‘బాబు బంగారం’ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ లోపల వెంకీ తన నెక్స్ట్‌ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్‌ సినిమా ‘సాలా ఖదూస్‌’ని రీమేక్‌ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్‌ కోచ్‌లా నటిస్తున్నాడు. అందుకోసం వెంకీ బాడీ బిల్డింగ్‌ చేస్తున్నాడు. సిక్స్‌ పాక్‌ కాదు గానీ బాడీ చాలా ఫిట్‌గా ఉండేలా, అందుకు తగ్గట్టుగా వర్కవుట్స్‌ మొదలెట్టేశాడు వెంకీ.

ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో రూపొందింది. అక్కడ మాధవన్‌ కీ రోల్‌ పోషించాడు. మాతృకలో హీరోయిన్‌గా నటించిన రితికా సింగ్‌నే తెలుగులోనూ తీసుకున్నారు. అయితే తెలుగు వెర్షన్‌కొచ్చేసరికి ఈ సినిమాలో చాలా మార్పులు చేస్తున్నారట. మాధవన్‌ లుక్‌లో కాకుండా వెంకీని చాలా డిఫరెంట్‌గా చూపించనున్నారట. అంతేకాదు వెంకటేష్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ని యాడ్‌ చేయనున్నారట.

హీరోయిన్‌గా వెంకీ పక్కన కొత్తమ్మాయి కోసం వెతుకులాట మొదలుపెట్టారని సమాచారం. యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయేలా ప్లాన్‌ చేస్తున్నారు. అదిరిపోయే యాక్షన్‌తో పాటు రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ కూడా జాయిన్‌ చేయనున్నారట ఈ సినిమాలో. ఇప్పటికే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘బాబు బంగారం’ సినిమాతో ఆకట్టుకుంటున్నాడు వెంకటేష్‌. మళ్లీ ఈ సినిమా కూడా డిఫరెంట్‌ ట్రాక్‌లో యాక్షన్‌ లవ్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోంది. ఈ సినిమా తరువాత వెంకీ ఒక థ్రిల్లర్‌ మూవీలో నటించనున్నాడని సమాచారం.