ఫామ్ హౌస్ CM పనయిపోయింది..

తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు ఖమ్మం ఆడ పడుచు రేణుకా చౌదరి దే.అయితే రాష్ట్ర విభజన అనంతరం రేణుకలో మునుపటి వాడి కనిపించలేదు.దానికి కారణాలేవయినా రేణుకా మాత్రం అడపా దడపా మీడియా ముందు కనపడటం మినహా చెప్పుకోదగ్గ విమర్సనాస్త్రాలు మాత్రం సంధించలేదు.

అయితే తాజాగా సినిమా స్టయిల్లో తెలంగాణా ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రేణుకా.పెన్షన్లకు,ఉద్యోగులకు జీతాలివ్వడానికే డబ్బుల్లేవంటారు కానీ బతుకమ్మకు మాత్రం బడా బడ్జెట్ ఉంటుంది.అయినా కెసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని తోచిన హామీలిస్తే వాటిలో ఏ ఒక్కటి అమలు కాదు.ఇప్పటికే 2 ఏళ్ళు అయిపొయింది.ఇక ఈ ప్రభుత్వం పని కూడా అయిపొయింది.ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే సినిమా ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.పనిలో పనిగా 2019 కంటే ముందే తెలంగాణలో ఎన్నికలొచ్చేస్తాయని రేణుకా చౌదరి జోస్యం కూడా చెప్పారు.

రేణుకా చౌదరి దూకుడు కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం.ఇప్పటికే జవసత్వాలు కోల్పోతున్న ప్రతిపక్షాలు మల్లన్న సాగర్..కోదండ రామ్ రూపం లో జవస్త్వాలొచ్చాయి.దానికి తోడు..ఎంసెట్ లీకేజీ..పలు మార్లు హై కోర్ట్ తెరాస ప్రభుత్వం పై మొట్టికాయలు వేస్తూనే వుంది.123 జీవో వంటి అంశాలు ప్రభుత్వ ప్రతిష్టను మసక బార్చాయి.ఇలా కెసిఆర్ ప్రభుత్వం పై ముప్పేట దాడి మొదలయింది.దీన్ని కెసిఆర్ ఎలా ఎదుర్కొంటాడా చూడాలి మరి.