గ్యారేజ్ లో నేనే మెయిన్: నిత్యా

జనతా గ్యారేజ్ సినిమా గురించి నిత్యా మీనన్ సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య సినిమా ప్రమోషన్ కోసం చాలా ఇంటర్వూస్ ఇచ్చింది నిత్యా. అయితే చాలామంది నిత్యను ప్రత్యేక పాత్రలో నటించారు అని ప్రశ్నించటం తో అసహనం వ్యక్తం చేసిందట.

అయితే ఇటీవలి ఓ ఇంటర్వ్యూలోనూ అదే ప్రశ్న ఎదుర్కొన్న ఈ అమ్మడు.. కాస్తంత ఘాటుగానే స్పందించింది. ప్రతి ఒక్కరూ తనను మెయిన్ హీరోయిన్ కాదంటున్నారని, తానేమీ ప్రత్యేక పాత్రలో చేయడం లేదని, తనదీ ప్రధాన హీరోయిన్ పాత్రేనని చెప్పుకొచ్చింది. అయితే అదంతా ట్రయిల్ కట్ చేసిన వారి తప్పేనని కూడా చెప్పింది. అయిన సినిమా చుసిన తరువాత ప్రేక్షకులే చెపుతారు నేను మెయిన్ హీరోయినో ప్రత్యేక పాత్రలో నటించానో అని చెప్పింది.