జనతా గ్యారేజ్ TJ రివ్యూ

సినిమా:జ‌న‌తా గ్యారేజ్‌
టాగ్ లైన్:రిపేర్లున్నా అంచనాల్ని అందుకుంది
రేటింగ్:3.5/5
థియేటర్:భ్రమరాంబ 70 MM
షో:మిడ్ నైట్ బెనిఫిట్ షో
బ్యాన‌ర్‌: మైత్రీ మూవీస్‌
న‌టీన‌టులు: జూనియ‌ర్ ఎన్టీఆర్‌, స‌మంత‌, నిత్యామీన‌న్‌, మోహ‌న్‌లాల్, సాయికుమార్,బ్రహ్మాజీ, ,బెనర్జీ,అజయ్,ఉన్ని ముకుంద‌న్‌, విదిశ త‌దిత‌రులు
నిర్మాత‌లు: మోహ‌న్ చెరుకూరి,న‌వీన్ ఎర్నేని ,య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: తిరు
మ్యూజిక్‌: దేవిశ్రీప్ర‌సాద్‌
ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ఫైట్స్‌: అన‌ల్ అర‌సు
ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి
ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌

ఎన్నో అంచనాలు..అంతకుమించి సంచలనాల నడుమ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విడుదలయింది.మాములుగా ఎదో ఒక సోషల్ ఎలిమెంట్ ని హైలైట్ చేస్తూ కొరటాల సినిమా బేస్ అయి ఉండటం మనం చూసాం.అయితే ఇందులో రెండు సోషల్ ఎలెమెంట్స్ ని కొరటాల జనతా గ్యారేజ్ కి ఎంచుకున్నాడు.1st హాఫ్ లో పర్యావరణ పరిరక్షణ ని టేక్ అప్ చేస్తే సెకండ్ హాఫ్ అంతా కష్టాల్లో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడం కాన్సెప్ట్.ఈ రెంటిని లింక్ చేస్తూ ఎన్టీఆర్ తో కొరటాల తీసిన జనతా గ్యారేజ్ అభిమానుల అంచనాల్ని ఏమాత్రం తక్కువ చేయదు.

మనం ట్రైలర్ లో చూసిందే సినిమా.కొత్తగా దాచిందేమి లేదు.అయితే అభిమానులతో పాటు,సగటు ప్రేక్షకుడు ఎన్టీఆర్ ని ఎలా చూడాలనుకుంటాడో అంతకు రెండింతలు ఎక్కువే చూపించాడు కొరటాల ఎన్టీఆర్ ని గ్యారేజ్ లో.నటన పరంగా ఎన్టీఆర్ మరో మెట్టు పైకెక్కాడు ఈ సినిమాతో.అటు లావుగా కాకుండా ఇటు మరీ సన్నగా లేకుండా ఎన్టీఆర్ అంటే ఇలానే ఉండాలి అనేలా వున్నాడు నందమూరి తారక రామారావు స్క్రీన్ పైన.

జనతా గ్యారేజ్ నడుపుతూనే కష్టాల్లో ఉన్న వారి కష్టాలు కూడా తీరుస్తుంటారు మోహన్లాల్ అండ్ మెకానిక్స్.ఇంకో వైపు ఎక్కడో ముంబై లో పర్యావరణం, దాన్ని కాపాడడమే పనిగా పెట్టుకున్న కుర్రాడు ఎన్టీఆర్..వీరిద్దరూ ఎలా కలిశారు..వీరి మధ్య బంధం ఏంటి..పర్యావరణం తో పాటు మనుషుల్ని కూడా కాపాడితే ఈ భూమి మరింత అందంగా ఉంటుందని ఎన్టీఆర్ గ్యారేజ్ లో చేరి ఏమి చేసాడన్నదే కథాంశం.

మోహన్ లాల్ కాకుండా వేరే ఎవ్వరిని ఈ సినిమా లో ఆ పాత్రకి వూహించుకోలేం.అంత గొప్పగా వుంది మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజన్స్.ఎన్టీఆర్ ఎంత గొప్పగా నటించాడో మాటల్లో చెప్పడం కష్టం.ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా ఒక లిమిట్ లో నటించాల్సిన సన్నివేశాలు, సందర్భాలు ఎన్నో వున్నాయి ఈ సినిమాలో..సరిగ్గా ఎదో కొలత పెట్టినట్టు ఎన్టీఆర్ చేసిన నటన నిజంగా అమోఘం.ఓ కొత్త ఎన్టీఆర్ ని కొరటాల గ్యారేజ్ ద్వారా ప్రేక్షకులకి పరిచయం చేసాడు.చిన్న చిన్న హావభావాలు కూడా ఎంతో గొప్పగా..అంతకంటే అద్భుతంగా ఎన్టీఆర్ పలికిన తీరు నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే..ఇక హీరోయిన్స్ సమంత,నిత్యా మీనన్ నటన నాచురల్ గా వుంది.మిగతా గ్యారేజ్ మెకానిక్స్,సురేష్,సాయికుమార్,దేవయాని తదితరులు వాళ్ళ పరిధిలో బాగానే నటించారు.రాజీవ్ కనకాల చిన్న పాత్రే చేసినా సినిమాను మలుపు తిప్పే పాత్రలో జీవించాడు రాజీవ్.

ఇదొక మంచి బేస్ ఉన్న కథ.మాస్ ని, యాక్షన్ ఎలిమెంట్స్ ని, సెంటిమెంట్ ని కలగలిపిన అద్భుతమైన కథ ఇది.అయితే ఆ మూడు దేనికది విడివిడిగా సినిమా మొత్తం అద్భుతంగా వున్నాయి.అయితే అన్ని ఒకదాని తరువాత ఒకటి సినిమాటిక్ గా చూసే సరికి ఎదో కొంత వెలితి కనబడుతుంది. కథ పరంగా కథనం పరంగా ఎక్కడా వేలెత్తి చూపలేము.స్క్రీన్ ప్లే ఇంకా ఇంటరెస్టింగ్ గా డీల్ చేసుంటే సినిమాలో ఆ ఇంపాక్ట్ ఇంకా బాగా కనిపించేది.ఇంటర్వెల్ తరువాత రాజీవ్ కనకాలతో ఎన్టీఆర్ మునిసిపల్ ఆఫీస్ లో చేసిన సీన్ సినిమా మొత్తానికే హై లైట్.ఆ 10 నిముషాలు సీన్ సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్ళిపోయింది.ఇలాంటి సన్నివేశాలు అక్కడక్కడా ఇంకో 3-4 ఉండుంటే సినిమా ఏ స్థాయికెల్లోదో ఊహించడం కష్టం అనేంతగా ఉండేది.

ఈ సినిమాలో డైలాగ్స్ భలే చిత్రంగా ఉంటాయి..అవి ఏ త్రివిక్రమ్ సినిమాల్లో లా పంచ్ డైలాగ్స్ లా వుండవు అలాగని పరుచూరి బ్రదర్స్ లా పేజీలు పేజీలు వుండవు..మనం రోజు మాట్లాడుకునే మాటల్లా ఉంటూనే సందర్భానికి తగినట్టు అద్భుతంగా రాశారు మాటలు. పాటలు అద్భుతంగా వున్నాయి.ఆడియో విన్నాక స్క్రీన్ పైన చూస్తుంటే విజువల్ ట్రీట్ లా వున్నాయి.దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి..అసలు సినిమా మూడ్ ని ఎప్పటికప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భుజాలపైకెత్తుకుని తీసుకెతుంది.ఇక సినిమాటోగ్రాఫర్ ‘తిరు’ గురుంచి కూడా స్పెషల్ గా చెప్పాలి..అంత విజువల్ వండర్ ని ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో తో ఓ కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకులకిచ్చినందుకు ఆయనకు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.ఫైట్స్ సిట్యుయేషన్ కి తగ్గట్టు నీట్ గా వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్ గా వున్నాయి.మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా సింప్ల్య్ సూపర్బ్.

ఈ మధ్య ఎన్టీఆర్ కి సూపర్ హిట్స్ వున్నాయి,హిట్స్ వున్నాయి,యావరేజ్ సినిమాలు కూడా వున్నాయి అయితే ఎన్టీఆర్ ఎన్నాళ్ళనుండో కలెక్షన్స్ పరంగా సూపర్ డూపర్ హిట్ ఒకటి ప్రేక్షకులకి బాకీ వున్నాడు.ఆ లోటు జనతా గ్యారేజ్ తీర్చేయనుంది.పైన చెప్పినట్టు కొంచెం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే..ఇంకొంచెం బాలెన్సుడ్ ఎమోషన్స్..హై వోల్టేజ్ సీన్స్ ఇంకొన్ని ఉండుంటే ఏ రేంజ్ సినిమా ఆయ్యేదో ఊహించడం కూడా కష్టం.అయినా సరే ఎన్నో రికార్డ్స్ ని జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ తిరగ రాయడం మాత్రం ఖాయం.