గ్యారేజ్ కి కెసిఆర్ కి లింక్ అదే

కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికే ట్రైలర్ లోనే రెవీల్ చేసేసారు.ఈ భూమన్నా ఈ భూమ్మీద ఏ సృష్టన్నా నాకు చాలా ఇష్టం.చెట్లు మొక్కలు,గాలి,నీరు..వాటిని కాపాడు కోవడమే హీరో పని.213 చెట్లు జోయీగ్రస్ పార్క్..ముంబై కి చాలా ఆక్సీజిన్ సప్లై చేస్తుంది.నేచర్ తో పెట్టుకుంటే జూమ్…చెట్లపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్.

అయితే కాకతాళీయమో లేక కొరటాల ప్లాన్ చేసిందో కానీ సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే కెసిఆర్ తెలంగాణలో హరిత హారం అనే మహా సంకల్పానికి శ్రీకారం చుట్టాడు.దీన్ని స్ఫూర్తిగానే కొరటాల జనతా గ్యారేజ్ స్టోరీ రాసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తరహాలో కథలు రాయడం కొరటాలకి కొత్తేమి కాదు.

ఇంతకు ముందు..ప్రేమను పంచుదాం..పగలు వద్దు అనే కాన్సెప్ట్ మిర్చి..ఆతరువాత ప్రధాని మోడీ గ్రామల్ని దత్తత కాన్సెప్ట్ ని శ్రీమంతుడు లో ఉపయోగించి అతి పెద్ద సక్సెస్ ని రుచి చూసాడు.ఇప్పు జనతా గ్యారేజ్ లో కూడా అదే మాదిరిగా ఓ ప్రజా ప్రాయోజిత కార్యక్రమాన్ని బేస్ చేసుకొని కథను అల్లాడని తెలుస్తోంది.ఈ సినిమా రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో దీనిపై తెలంగాణ నాయకులు ఎలా స్పందిస్తారో ముక్యంగా కెసిఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో ఆసక్తి కరంగా వుంది.