శృతిహాసన్‌ ‘లవ్‌’ ఎవరో తెలుసా! 

‘ఆల్‌ ది బెస్ట్‌ తమ్మీ’ అని శృతిహాసన్‌ ట్వీటేసింది. ‘అభినేత్రి’ సినిమా కోసం తమన్నాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన శృతిహాసన్‌, ‘తమ్మీ’ అని ముద్దుగా తమన్నాని కోట్‌ చేసింది. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో తమన్నా డ్యూయల్‌ రోల్‌లో కనిపించనుంది. ఒకదానితో ఒకటి సంబంధం లేని రెండు వెరైటీ గెటప్స్‌లో దర్శనమివ్వనున్న తమన్నా, ‘అభినేత్రి’ సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఒక పాత్రకు అస్సలు గ్లామర్‌ టచ్‌ ఉండదు. ఇంత వరకూ తమన్నా గ్లామర్‌ టచ్‌ లేని సినిమాలో నటించలేదు. అందుకే డీ గ్లామర్‌ అయిన ఈ పాత్ర కోసం తమన్నా చాలా పాత సినిమాలు తిరగేసిందట. ఇక ఆ రెండో పాత్ర చాలా సూపర్బ్‌ గ్లామరస్‌గా ఉంటుంది. ఇలా రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న ఈ రెండు పాత్రల్లో నటించడానికి తమన్నా చాలా కసరత్తులే చేసిందట.

ఇంత కష్టపడిన తమన్నాకి శృతిహాసన్‌ బెస్ట్‌ విషెస్‌ చెప్పడం అభినందనీయం. వీరిద్దరి మధ్యా ఇంత స్నేహం ఉందా? అని ఆశ్చర్యపోయరంతా. ‘థ్యాంక్యూ మై లవ్‌’ అని శృతిహాసన్‌కి కృతజ్ఞతలు తెలిపింది తమన్నా. అంటే శృతిహాసన్‌కీ తమన్నాకీ మధ్య ‘లవ్‌’ ఉన్నట్లే కదా. ఇదే వీరిద్దరి మధ్యా ఉన్న అంతకుమించిన స్నేహం. దటీజ్‌ లవ్‌లీ ఫ్రెండ్‌షిప్‌. శృతి హాసన్‌ తమిళంలో ‘శభాష్‌ నాయుడు’ సినిమాలో నటిస్తోంది. కమల్‌కు కూతురిగా నటిస్తోంంది ఈ సినిమాలో శృతిహాసన్‌. ఎనీ వే కీప్‌ ఇట్‌ అప్‌ లవ్‌లీ ఫ్రెండ్స్‌.