బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్

స్టీల్ సిటీ విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌గా పలు చిత్రాలు తెరకెక్కాయి. ఏడాదిన్నర నాటి ఎన్టీఆర్ చిత్రం ‘టెంపర్’ కూడా వైజాగ్‌ నేపథ్యంలోనే రూపొందింది. ప్రకృతి సొగసులకూ ఇక్కడ కొదువలేదు. దీంతో అందమైన దృశ్యాలను అందుబాటులోనే చిత్రీకరించాలనుకునే దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాన్స్‌గా వైజాగ్ మారిపోయింది. అందుకే ఇక్కడ చాలా సినిమాల షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఇక విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమా సైతం ఇక్కడే మొదలుకాబోతోందని సమాచారం.

మాధవన్ నటించిన ‘సాలా ఖడూస్’ను వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ స్టోరీ బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగుతుంది. బాక్సింగ్ కోచ్ గా వెంకటేశ్ కొత్త లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ మూవీలో మరో కీలక పాత్ర మహిళా బాక్సర్. జాలర్ల కుటుంబానికి చెందిన ఓ యువతికి కథానాయకుడు బాక్సింగ్‌లో కోచింగ్ ఇచ్చి ఛాంపియన్‌గా నిలబెడతాడు. ఈ క్యారక్టర్‌కు ఎవర్ని సెలెక్ట్‌ చేశారో తెలీదు. నటనకు ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.