‘కబాలి’ లీక్‌ అయిపోయింది

ప్రపంచం మొత్తం ‘కబాలి’ మానియా నడుస్తోంది. సాధారణ వ్యక్తి నుండీ, స్టార్స్‌ వరకూ ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ ఉన్న సినిమా రికార్డులు అన్నీ బద్దలు కొట్టడానికి భారీ హైప్‌తో వస్తున్నాడు ‘కబాలి’. అయితే ఇంతగా పబ్లిసిటీ జరుగుతున్న ఈ సినిమా పైరసీ బారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది.

నెట్‌లో ‘కబాలి’ సినిమా వీడియో లీక్‌ అయిపోయింది. రెండున్నర నిముషాల వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకుముందే ఇంటర్నెట్‌లో సినిమా లీక్‌ కాకుండా, పైరసీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ నిర్మాత న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఉపయోగం లేకుండాపోయింది. ఇంకో వైపున ‘కబాలి’ సినిమాను నిలిపివేయాలంటూ ‘లింగా’ చిత్ర డిస్ట్రిబ్యూటర్‌ ఒకరు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే న్యాయస్థానం ఆ పిటిషన్‌ని తోసిపుచ్చింది. సుక్ర ఫిలింస్‌ వాటాదారు మహాప్రభు, ‘లింగ’ సినిమాతో తాము 89 లక్షలు నష్టపోయామని ఆరోపిస్తున్నారు. రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పా రంజిత్‌ డైరెక్ట్‌ చేశారు. ఒకవైపు హై లెవల్లో పబ్లిసిటీ, మరోవైపు ఈ రకంగా గొడవలు ‘కబాలి’ నిర్మాతలను కలచి వేస్తున్నాయి. బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ సినిమాకు తొలిరోజే 200 కోట్ల వసూళ్లను అంచనా వేస్తున్నారు. అయితే ఇంటర్నెట్‌లో రెండు నిమిషాల నిడివి గల వీడియో లీక్‌ కావడంతో, రేపటికి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.