‘కబాలి’ కోసం ఎదురు చూపులు

నింగి ఆకాశం ఎప్పుడూ కలవవు. కానీ తెలుగు, తమిళ ప్రేక్షకులు మాత్రం సరి సమానంగా కలిసి కట్టుగా ఎదురు చూస్తున్నది.. కబాలి సినిమా పండగ కోసం. ప్రపంచ వ్యాప్తంగా 10వేల ధియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోందంటే అది ఏమీ చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు సైతం తమదైన శైలిలో ‘కబాలి’ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు.

తద్వారా తమ సంస్థలకు కూడా డిమాండ్‌ ప్రకటించుకుంటున్నాయి. అంతే కాదు ‘కబాలి’ అనే పేరుతోనే ప్రపంచం మొత్తం ఈ సినిమా విడుదల కావడం మరో విశేషం. ఇంతవరకూ రజనీ సినిమాల్లో ఏ సినిమా కూడా అన్ని భాషల్లోనూ ఒకే పేరుతో విడుదల కాలేదు. తెలుగులో విడుదలకొస్తే తెలుగు నేటివిటీకి సంబంధించిన టైటిల్‌తో విడుదల చేసేవారు. కానీ ‘కబాలి’ విషయంలో ఇదొక రికార్డు అయ్యింది.

తమిళంలోనూ, తెలుగులోనూ కూడా ‘కబాలి’గానే విడుదలవుతోంది. పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్‌ ఏజ్డ్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తాడు. ఒరిజినల్‌ లుక్‌లో మెరిసిన జుట్టు, మెరిసిన గెడ్డంతోనే కనిపిస్తాడు. కబాలి భార్యగా రాధికా ఆప్టే నటిస్తోంది. ఈ సినిమాలోని ఫైట్లు చాలా నేచురల్‌గా ఉంటాయట. అంతేకాదు రజనీ కాంత్‌ ఎంట్రీ ఈ సినిమాలో ఇంతకు ముందు సినిమాల కన్నా డిఫరెంట్‌గా ఉండబోతోందట.