గ్యారేజీపై హైప్‌ని తారక్‌ తట్టుకోగలడా! 

కొరటాల శివ డైరెక్షన్‌లో రానున్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాపై విపరీతమైన హైప్‌ నెలకొంది. ఎంతలా? అంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ అదేనండీ తారక్‌ తట్టుకోగలడా? అన్న అనుమానాలు కలిగేంతలాగా అట. సినీ వర్గాల్లో ‘జనతా గ్యారేజ్‌’ గురించి జరుగుతున్న చర్చ, సినీ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తోందని సమాచారమ్‌. కనీ వినీ ఎరుగని స్థాయిలో సినిమాకి బిజెనెస్‌ అవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో తారక్‌ మెయిన్‌ ఫ్యాక్టర్‌. తారక్‌కి దర్శకుడు కొరటాల శివ ఫ్యాక్టర్‌ యాడ్‌ అవడంతో, సినిమా మీద హైప్‌ డబుల్‌ అయ్యింది. ఆన్‌ స్క్రీన్‌ ఎనర్జీ చూపించడంలో తారక్‌ ఇరగదీసేస్తాడు. ఆ ఎనర్జీ లెవల్స్‌ని పదింతలుగా చూపడం కొరటాల శివకి మెగాఫోన్‌తో పెట్టిన విద్య. అలా ఈ సినిమాపై హైప్‌ ఎవరూ ఊహించని రీతిలో పెరిగిపోయింది.

ఓవర్సీస్‌ మార్కెట్‌లో తారక్‌ ‘జనతా గ్యారేజ్‌’తో సంచలనాలు సృష్టించనున్నాడని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే తొలిరోజు ‘జనతా గ్యారేజ్‌’ ప్రభంజనమేనని అనుకుంటున్నారు. తారక్‌ తట్టుకోవడం కాదు, తారక్‌ తన ఇమేజ్‌తో సినిమాకి వచ్చిన టాక్‌ని మించి వసూళ్ళను సాధిస్తాడని అభిమానులూ కాన్ఫిడెన్స్‌ వ్యక్తం చేయడం జరుగుతోంది. ఓవరాల్‌గా ‘జనతా గ్యారేజ్‌’ సూపర్బ్‌ ప్రోడక్ట్‌లా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అనుకోవచ్చు. అతి త్వరలో సినిమా ఆడియో విడుదల కానుంది. ఆడియో వచ్చాక, సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు కదా.