అభిమాని నష్టాలు తీర్చనున్న పవన్ కళ్యాణ్

‘అఖిల్‌’ సినిమాతో తొలిసారిగా నిర్మాత అవతారం ఎత్తాడు హీరో నితిన్‌. అఖిల్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తోనే ఈ సాహసం చేశాడు నితిన్‌. కానీ ప్రయోగం వికటించింది. ఈ ప్రయత్నంలో ఘోర పరాజయం చవి చూశాడు నితిన్‌. ఆ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది నితిన్‌కి. అయితే ఆ నష్టాల నుంచి మానసికంగా కోలుకునేలా ‘అ,ఆ..’ సినిమా పెద్ద హిట్‌నిచ్చి ఊరటనిచ్చింది. ఈ ఊపులో నితిన్‌, పవన్‌కళ్యాణ్‌ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారమ్‌. తన బ్యానర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ తన దేవుడు పవన్‌కళ్యాణ్‌ ద్వారా తనకు దక్కాలని నితిన్‌ అనుకుంటున్నాడట. ఈ విషయమై నితిన్‌, పవన్‌ని అడిగాడట. అందుకు పవన్‌ ఓకే చేశాడని కూడా ఇండస్ట్రీలో టాక్‌ విన్పిస్తోంది.

పవన్‌కళ్యాణ్‌, ప్రస్తుతం ఎజ్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత పవన్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు దాసరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి ఈ సినిమాల తర్వాత ఏమైనా నితిన్‌కి ఛాన్స్‌ ఇస్తాడేమో పవన్‌ చూడాలి. పవన్‌ నుంచి ఛాన్స్‌ దక్కితే అది గోల్డెన్‌ ఛాన్సే అవుతుంది నితిన్‌కి. పవన్‌ తన సినిమాతో ఎందరో ప్రొడ్యూసర్స్‌కి కాసుల వర్షం కురిపించి నష్టాల బాట నుంచి బయట పడేలా చేశాడు. నితిన్‌కి ఈ అవకాశం ఎప్పటికి దక్కుతుందో చూడాలి.