నయనతార అంతగా పెంచేసిందా?

నయనతార మరీ టూమచ్‌ అని అనుకుంటున్నారు టాలీవుడ్‌లో. ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్న నయనతార వద్దకు ఈ మధ్యనే ఓ నిర్మాత వెళ్ళారట. తన సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాలని కోరగా, రెండు కోట్లకు పైనే నయనతార డిమాండ్‌ చేసిందని సమాచారమ్‌. నయనతారకి ఇదివరకటిలా ఇప్పుడు సక్సెస్‌లు లేవు, నిర్మాతలూ ఆమె కోసం ఎగబడటం లేదు. సీనియర్‌ హీరోయిన్‌ అయిపోయిన నయనతారకి, యంగ్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ లేదు. అయినప్పటికీ నయనతార రెమ్యునరేషన్‌ రెండు కోట్లకు పెంచడం సినీ వర్గాల్ని ఆశ్చర్యపరిచిందట. ‘బాబు బంగారం’ చిత్రానికి నయనతార ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంది? అని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అయితే ఆ ఫిగర్స్‌ గురించి బయటకు ఎవరూ రివీల్‌ చేయడంలేదట. ఆ మధ్యన మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా కోసం నయనతారను సంప్రదించారని కూడా టాక్‌ నడిచింది. అయితే యూనిట్‌ తరఫున ఎవరూ ఆమెను సంప్రదించలేదని ఇంకో టాక్‌ కూడా బయటకు వచ్చింది. రెమ్యునరేషన్‌ దగ్గర తేడా రావడంతో నయనతారను లైట్‌ తీసుకున్నారేమో! 2 కోట్లతో నయనతారను తెచ్చుకోవడం కన్నా, ఇంకో కోటి ఎక్కువ వేసుకుంటే బాలీవుడ్‌ నుంచి ఫ్రెష్‌ బ్యూటీలు ఎందరో రెడీగా ఉన్నారు. ఇంకో వైపున తమిళంలో శింబుతో సినిమా చేసి హిట్‌ కొట్టిన నయనతార, రెమ్యునరేషన్స్‌ గాసిప్స్‌పై స్పందించట్లేదు. అఫ్‌కోర్స్‌, ఆమెకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు.