మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి స్థానిక ఎన్నికలను పార్టీల కంటె కూడా, స్థానికంగా నాయకుల సొంత బలం, వారి పరిచయాలు ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కూడా జగన్మోహన రెడ్డి సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు దక్కిన ప్రజల […]
Tag: ysrcp
గుర్తుందా గురూ..మరి ఇప్పుడు .. మండలితో ప్రయోజనం ఉంటుందా?
’రాజకీయ కోణంలో తాత్కాలికంగా బిల్లుల్ని అడ్డుకునేందుకే మండలి ఉంది.. దీనివల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం, ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచీ జరగని అవకాశం కనిపించడం లేదు..దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం కూడా దండగ.. అందుకే శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నాం’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతూ ఉంది. సీన్ కట్ చేస్తే.. ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది.. శాసనమండలిలో 14 […]
పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?
కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది. కిం కర్తవ్యం? ఏం చేయాలి? చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో […]
పదేపదే అభాసుపాలు.. జగన్ తీరు మారదా?
అమరావతి రాజధాని కేసులకు సంబంధించి రోజువారి విచారణలు ప్రారంభం అయ్యాయి. సీజే ప్రశాంత్ మిశ్రతో సహా మరో ఇద్దరు న్యాయమూర్తులు వాదనలు వింటున్నారు. తొలిరోజు అమరావతి రైతుల తరఫున వినిపించిన వాదనల్లో ‘మూడు రాజధానులు’ అనే ఆలోచనే మరచిపోవాలంటూ.. వారు విన్నవించడం జరిగింది. మొత్తానికి రోజువారీ విచారణల పర్వం మొదలైంది గనుక.. అమరావతి రాజధాని విషయంలో తొందరల్లోనే ఒక నిర్ణయం వస్తుందని.. అమరావతా? మూడు రాజధానులా? అనే విషయంలో కోర్టు పరంగా ఉన్న అడ్డంకి తొలగిపోతుందని అనుకోవచ్చు. […]
సారుకు సడన్ గా రోడ్లెందుకు గుర్తుకొచ్చాయో?
కాస్త ఆలస్యమైనా ఏపీ సీఎం జగన్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని.. ఒక్క గుంత కూడా రోడ్డుపై కనిపించరాదని అధికారులను ఆదేశించారు. 46వేల కిలోమీటర్ల రోడ్లను జూన్ 2022లోపు మరమ్మతులు చేయాలని, రోడ్లన్నీ క్లీన్ గా కనిపించాలని పేర్కొన్నారు. ఈనెలాఖరు నాటికి 8268 కిలోమీటర్ల రోడ్లకు రిపేరు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కూడా ఆదేశించారు. పల్లె, పట్టణం, మునిసిపాలిటి, కార్పొరేషన్, రాష్ట్ర.. […]
సుజనా, సీఎంలకు తలంటు పోసిన అమిత్ షా!
కేవలం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం మాత్రమే కాదు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన తిరుపతి పర్యటనను రాష్ట్రంలో పార్టీని చురుగ్గా పరుగులు పెట్టించడానికి కూడా ఒక అవకాశంగా మలచుకున్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం నాడే పూర్తి కాగా, సోమవారం పూర్తిగా పార్టీ నేతలతోనే గడిపారు. వారితో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం గురించి.. వారికి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ […]
బాబు ప్రాభవానికి గండికొట్టే ఎన్నికలివి!
కుప్పం మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రాభవానికి గండి పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. 25 వార్డులు ఉన్న కుప్పం మునిసిపాలిటీలో- 15 వార్డుల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందగలరా అనేది కూడా ప్రశ్నార్థకమే అవుతుంది! తన సొంత ఊరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గం తనను తిరస్కరించిన తర్వాత.. చంద్రబాబు జిల్లాకు ఒక మూలగా […]
జగన్‌కు పనిచెప్పడమే పవన్ కల్యాణ్ పోరాటమా?
విశాఖ ఉక్కును తాను కాపాడేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ వాసులకు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. అదే వేదిక మీదనుంచి.. జగన్మోహన్ రెడ్డి ఏం పనులు చేయాలో, విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో.. కొన్ని పనులను పవన్ కల్యాణ్ డిక్టేట్ చేశారు. విశాఖ ఉక్కుకోసం ఆయన పోరాటంలో తొలి అధ్యాయం అలా ముగిసింది. సినిమాల షూటింగులకు మధ్య వచ్చే షెడ్యూల్ గ్యాప్‌లో పవన్ […]
అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిపడ్డ పవన్..అసలేమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, పవన్ కు మాత్రం ఏకంగా భక్తులే ఉంటారు. అయితే ఆ భక్తులే ఇప్పుడు పవన్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ తన అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్దని, పవర్ లేనివాడు పవర్ […]