బాబుకు షాక్‌:ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న సెగ‌లు రేప‌డం ఖాయం

ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సాక్షిగా అధికార టీడీపీలో పెద్ద లుక‌లుక‌లు స్టార్ట్ అయ్యేలా క‌నిపిస్తున్నాయి. పైకి మాత్రం వాతావ‌ర‌ణం అంతా స‌వ్యంగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోన్నా లోప‌ల మాత్రం అసంతృప్తి గాలి బుడ‌గ‌లా ఉంద‌ని…అది ఎప్పుడైనా ఢాంన పేల‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మంత్రివ‌ర్గంలో భారీ స్థాయిలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుంది. 7 గురు మంత్రుల‌ను త‌పించే బాబు కొత్త‌గా 13 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో పార్టీలో సామాజిక‌వ‌ర్గాలు – ప్రాంతాలు – సీనియారిటీని […]

వాళ్ల ఫైటింగ్‌తో బాబుకు నిద్ర ప‌ట్ట‌డం లేదా..!

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ వేళ‌.. సీఎం చంద్ర‌బాబు స‌రికొత్త టెన్ష‌న్ మొద‌లైంది. పైకి అంతా బాగానే క‌నిపిస్తున్నా.. కర్నూలు జిల్లాలో మాత్రం ప‌రిస్థితులు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్నాయి. ఈసారి విస్త‌ర‌ణ‌లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నంధ్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి చోటు ద‌క్క‌వ‌చ్చనే ప్రచారం పార్టీ వ‌ర్గాల్లో జోరుగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో భూమా చేరిక‌ను తొలి నుంచి వ్య‌తిరేకిస్తున్న శిల్పా వ‌ర్గం.. వైసీపీలో చేర‌వ‌చ్చ‌చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో […]

కడప ఎమ్మెల్సీలో గెలుపు ఎవరిది..? ఓటు రేటు తెలిస్తే షాకే..!

మండ‌లి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ అధికార‌, విప‌క్షాలు శిబిర రాజ‌కీయాల‌కు తెర‌తీశాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌పై టీడీపీ ప్ర‌త్యేకంగా దృష్టిసారించింది. దీంతో ఎలాగైనా ప‌ట్టు నిలుపుకోవాల‌ని ప్ర‌తిప‌క్షం ఆరాట‌ప‌డుతుంటే.. ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని అధికార పక్షం వ్యూహాలు ర‌చిస్తోంది. ఇరు ప‌క్షాల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల పంట పండింది. త‌మ శిబిరాల్లోకి వ‌చ్చే వారిపై కాసులు కుమ్మ‌రించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రూ.40 ల‌క్ష‌ల వ‌ర‌కూ […]

ఆ మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ … ఎందుకంటే ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీన్ రివ‌ర్స్ అయింది. మొన్న‌టివర‌కూ అధికార ప‌క్షం హ‌వా న‌డిచిన చోట‌.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి. వైసీపీని వీడి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోతుంటే.. వారి ప్ర‌త్య‌ర్థులుగా, టీడీపీలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న‌వారు వైసీపీ కండువా క‌ప్పేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌ల స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న అధినేత జ‌గ‌న్‌కు.. పార్టీలో చేరిన, చేర‌బోయే వారిని అస్త్రాలుగా మార్చ‌బోతున్నారు. ప్ర‌స్తుతం తాడిప‌త్రి, ఆళ్ల‌గ‌డ్డ‌, […]

వైసీపీ క్యాడర్ ను తికమక పెడుతున్న మాజీమంత్రి

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో `గోపి(గోడ మీద పిల్లి)`లు ఎక్కువమంది! ఏమాత్రం మంచి అవ‌కాశం వ‌చ్చినా  ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి..  ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిపోయే నాయ‌కులే ఎక్కువ‌! ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉంటూ.. అటు అధికార పార్టీ నేత‌లోనూ స‌న్నిహిత సంబంధాలు నెరుపుతూ.. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్న వారే అధికం!! ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని ఒక మాజీ మంత్రి కూడా ఇలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఆమె ఏ పార్టీకి చెందిన వారో తెలియక […]

టీడీపీ ఎమ్మెల్సీ సీట్లు దక్కేది వీళ్ళకేనా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాస‌నమండ‌లికి వెళ్లే పెద్ద‌ల జాబితా సిద్ధ‌మైంది. తీవ్ర చ‌ర్చ‌లు, సామాజిక వ‌ర్గాల బేరీజు, ఆశావ‌హుల సీనియారిటీ వంటి అన్ని అంశాల‌ను ప‌రిశీలించి ఎట్ట‌కేల‌కు తుది లిస్ట్‌ను త‌యారుచేసిన‌ట్టు తెలుస్తోంది. కొత్త‌గా వ‌చ్చిన వారితో పాటు పార్టీలో ఎంతో కాలం నుంచి కొన‌సాగుతున్న సీనియ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్న విష‌యం తెలిసిందే! ఈ మేర‌కు అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం దీనిని రూపొందిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆరో అభ్య‌ర్థిని కూడా గెలిపించుకునేందుకు సీఎం ప‌క్కా […]

ఆ ఇద్ద‌రు మంత్రులు జ‌గ‌న్ గూటికి జంప్‌ … ఇదే నిదర్శనం

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ పేరు చెబితే టీడీపీ నేత‌లు స‌ర్రున‌ ఒంటికాలిపై లేస్తారు. ఇక మంత్రుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు! కానీ ఏపీ కేబినెట్‌లోని ఇద్ద‌రు మంత్రులు జ‌గ‌న్‌తో స‌న్నిహిత సంబంధాలు నెరుపుతున్నారా? నిత్యం జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉంటూ.. ఎప్పటిక‌ప్పుడు స‌మాచారాన్ని అంద‌జేస్తున్నారా? ఇక వారు రేపో మాపో టీడీపీని వీడి జ‌గ‌న్ గూటికి చేరేందుకు సిద్ధ‌మవుతున్నారా? అంటే అవుననే స‌మాచార‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా ప్ర‌స్తుతం టీడీపీపై ప్ర‌జ‌ల్లో క్ర‌మ‌క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది. […]

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ల‌గ‌డ‌పాటి… నియోజ‌క‌వ‌ర్గం క‌న్‌ఫార్మ్‌..!

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరొందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరు తెలియ‌ని వారుండ‌రు! రాష్ట్ర విభ‌జ‌న‌లో కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించిన తీరుకు తీవ్రంగా క‌లత చెందిన ఆయ‌న‌.. కొద్ది కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. కానీ ప్ర‌స్తుతం ఆయన రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. దీనికి సంబంధించి మ‌రో సంచ‌ల‌న విష‌య‌మేంటంటే.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యే పోటీ చేయ‌బోతున్నార‌ట‌. ఇందుకు సంబంధించి నియోజ‌క‌వ‌ర్గం కూడా దాదాపు ఖ‌రారు అయింద‌ని స‌మాచారం. ఈ […]

జ‌గ‌న్ రియాక్ష‌న్‌తో షాక్‌లో రోజా..!

వైకాపా మ‌హిళా విభాగంలో కీల‌క రోల్ పోషిస్తున్న న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకి ఆ పార్టీ బాస్ నుంచి స‌రైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదా? రోజా విష‌యంలో జ‌గ‌న్ ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావ‌డం కాలేదా? రెండు రోజుల కింద‌ట జ‌రిగిన పోలీస్ వ‌ర్సెస్ రోజా ఎపిసోడ్‌లో జ‌గ‌న్‌.. రోజాకి ఝ‌ల‌క్ ఇచ్చారా? ఈ నేప‌థ్యంలో ఇక త‌న జ‌బ‌ర్ద‌స్త్‌కి ఫుల్ స్టాప్ పెట్టి సాఫ్ట్ కార్న‌ర్ ఎంచుకోవాల‌ని రోజా డిసైడ్ అయ్యారా? అంటే ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. […]