భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]
Tag: YS Jagan
నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?
గత ఎన్నికల్లో జగన్ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల […]
జనంలో కాదు సోషల్ మీడియాలో యాక్టివ్
ఆర్‌కే అలియాస్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. ఈ పేరు వింటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఓ భరోసా.. ఓ నమ్మకం.. అయితే ఇది ఇప్పుడు కాదు.. గతంలో..ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలుపొందిన నాటి సంగతి. ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడి 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. కేవలం 12 ఓట్లతో మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికై వార్తల్లో నిలిచాడు. ఆ తరువాత జనం కోసం నిలబడి వారి మద్దతు కూడగట్టాడు. […]
అధికారంపై ఎన్ని ఆశలో..
ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగానే పట్టుంది.. పార్టీ హైకమాండుకు ఉత్తర దేశంపై దిగులు లేదు. బాధంతా దక్షిణాదిపైనే.. అరె.. ఈ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తెద్దామంటే కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలోనే సాధ్యమైంది. తమిళనాడులో అస్సలు దగ్గరకు రానీయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ పరువు నిలుపుకుందామనేది పెద్దల ఆలోచన. తెలంగాణలో కాస్తో..కూస్తో పార్టీ బండి లాగుతోంది. ఏపీలోనే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు నాయకులు అస్సలు చేయడం లేదని […]
ఫస్ట్ ఎటు పోదాం సామీ?
ఆయనంటే రాజకీయ నాయకులకు ఓ నమ్మకం.. ఓ భరసా.. తమ పార్టీని అధికారంలోకి తెస్తాడనే ఆశ.. అలా చేశాడు కూడా.. కావాల్సినంత డబ్బులిస్తే తన మేధస్సు ఉపయోగించి ఎలాగైనా పవర్ తెప్పిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు.. అలా జరుగుతోంది కూడా. ఆయనే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. అలాంటి వ్యక్తే ఇపుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ఏ విషయంలో అంటే తెలుగు రాష్ట్రాల విషయంలో. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని మాటిచ్చాడు. […]
ఏం జరుగుతోందో నాకు తెలియాలి?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం తక్కువే అయినా సీనియర్ పొలిటీషియన్ల ఆలోచనల కంటే పది అడుగులు ముందుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ఊహించని డిసిషన్ తీసుకుంటాడు. అందుకే పార్టీని స్థాపించి.. అధికారాన్ని తెచ్చి.. ఒంటిచేత్తో నడుపుతున్నాడు. ఓ వైపు సీఎంగా ప్రభుత్వాన్ని.. మరో వైపు అధ్యక్షుడిగా పార్టీని విజయవంతంగా నడుపుతున్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే తిరుగుండదు అంతే.. ఎవరూ ఎదురు చెప్పలేరు. ఎవ్వరినీ ఓ పట్టాన నమ్మడు.. నమ్మితే వదలడు […]
పుష్ప, ఆర్ఆర్ఆర్ లకు బిగ్ రిలీఫ్..!
ఏపీలో సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం టాలీవుడ్ నుంచి రాబోయే భారీ చిత్రాలకు పెద్ద ఊరట గా నిలిచింది. కొన్ని నెలల కిందటి వరకు సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు థియేటర్ల యజమాన్యానికి ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తామని ప్రకటించి.. సినిమా టిక్కెట్ల ధర తగ్గిస్తూ జీవో జారీ చేసింది. దీనిపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు […]
వీకెండ్ అయితే మేలు గురూ..
శని, ఆదివారాలైతే మేలు.. ఆ రోజులు సెలవు రోజులు… కాస్త సమయముంటుంది.. ఎంజాయ్ చేయవచ్చు.. చాలా మంది ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇలా భావిస్తారు. టూర్, పబ్, బార్.. ఇలా ఏది వీలైతే దాన్ని ఎంచుకొని టైంపాస్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ, ఏసీబీ అధికారులు కూడా వీకెండ్ ప్లాన్ ను ఎంచుకుంటున్నారు. అరె.. వారు కూడా వారాంతంలో ఎంజాయ్ చేస్తారా అని అనుకోవద్దు. వారు వీకెండ్ ను ప్లాన్ చేసుకునేది […]
నాడొక మాట.. నేడొక మాట.. దటీజ్ బాబు
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) […]