ఇటీవల కాలంలో జగన్ ఎక్కువగా జనంలోనే ఉంటున్నారు. ఏదొక కార్యక్రమం పేరుతో భారీ సభలు పెడుతూ..ప్రజలతో మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకానికి బటన్ నొక్కడం గాని, లేదా ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి శంఖుస్థాపన చేయడం గాని..ఏదొక జిల్లాలో ఒక కార్యక్రమం పెట్టుకుని అక్కడ భారీగా జనాలని సమీకరించి సభ పెడుతున్నారు. అయితే సభకు భారీగా జనాలని సమీకరిస్తున్నారు. వాలంటీర్లు, వైసీపీ నేతలు, సచివాలయ ఉద్యోగులు..జగన్ సభకు జనాలని రప్పించే కార్యక్రమాలని చేస్తున్నారు. అలా కాకుంస స్వచ్ఛందంగా ఎంతమంది జనం […]
Tag: YCP
టీడీపీ మేనిఫెస్టో రెడీ..ఊహించని హామీలతో బాబు..!
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేయలేని పరిస్తితి..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. అంటే తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరిగేలా ఈ ఏడాది చివరిలో ప్రభుత్వం రద్దు చేసి..ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుంది. ఇక ముందస్తుపై ప్రతిపక్ష టీడీపీ రెడీ అవుతుంది. మొదట నుంచి జగన్ ముందస్తు […]
కడప కోటలోకి లోకేష్..టీడీపీకి ఛాన్స్ ఉంటుందా?
యువగళం పాదయాత్రతో నారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలు తెలుసుకుంటూ, అండగా నిలబడుతున్నారు. ప్రజలతో మమేకమవుతుండటంతో లోకేష్‌కు ప్రజల నుంచి మద్ధతు కూడా వస్తుంది. మొదట్లో లోకేష్ పాదయాత్రకు పెద్దగా ప్రజాధరణ రాలేదు..కానీ నిదానంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న తీరు ఆకట్టుకుంటుంది. అలాగే తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుని లోకేష్ విమర్శలు […]
బాలినేని ప్లేస్‌లో కొత్త నేత.. ఎవరు? జగన్ ప్లాన్ ఏంటి?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన వైసీపీ కీలకనాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో కొత్త ముఖానికి చోటుకల్పిస్తున్నారా? ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. పార్టీ అధిష్టానం అప్పగించిన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కో-ఆర్డినేటర్‌గా బాలినేని రాజీనామా చేయడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఆ మధ్య ఆయనకు మళ్లీ మునుపటి రోజులొచ్చాయని.. ఇక అన్నీ బాగానే ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆ ప్రచారం మాట […]
జగన్ చెప్పులపైనా ఇంత రాజకీయం జరుగుతోందా…!
సాధారణంగా ఒకనాయకుడి గురించి ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేయడం సహజమే. దీనిని ఎవరూ కాదనరు. పాలన పరంగా కానీ.. పార్టీ పరంగా కానీ.. ఇతరత్రా విధానాల పరంగా కానీ.. నాయకులపై ప్రత్యర్థులు విరుచుకుపడడం.. సవాళ్లురువ్వడం.. సహజమే. ఏపీలోకి వచ్చేసరికి.. అధికార వైసీపీ నాయకుడు, సీఎం జగన్‌పై ప్రతిపక్షం టీడీపీ నాయకులు కూడా ఇదే తరహాలో రాకీయాలు చేస్తున్నారు. ఆయన విధానాలను.. ఎండగడుతున్నారు. ఆయన రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా జగన్ ధరించే చెప్పుల […]
ఆ వైసీపీ నేతలకు పవన్‌తోనే నష్టం..అందుకే టార్గెట్.!
ఎప్పుడో రాక రాక ఏపీలో అడుగుపెడతారు. ఇక ఆయన అడుగు పెట్టడమే ఆలస్యం వైసీపీ నేతలు మీడియా సమావేశాలతో రెడీగా ఉంటారు. ఆయన టార్గెట్ గా ఓ రేంజ్ లో విమర్శలు చేయడం, తిట్టడం చేస్తారు. పైగా ఇప్పుడు పవన్..టిడిపితో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశారు. దీంతో వైసీపీ నేతలు మరింత ఎటాకింగ్ మొదలుపెట్టారు. పవన్‌ని ఓ రేంజ్ లో టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అభిమానులని, కాపులని పవన్ తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే వారి […]
ఆ వర్గం ఓట్లపై బాబు ఫోకస్..జగన్ స్కెచ్.!
ఏపీలో నెక్స్ట్ గెలవడానికి ఇటు జగన్, అటు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ గద్దెనెక్కడమే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్‌కు చెక్ పెట్టి ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు అందివచ్చిన అవకాశాలతో రాజకీయం చేస్తూ ఎక్కడకక్కడ జగన్‌ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో జగన్ కు మద్ధతు తెలిపిన వర్గాలని టిడిపి వైపుకు తిప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు […]
కాపు ఓట్లపై చర్చ..పవన్ నిర్ణయంతో ఎటువైపు.!
పూర్తి మద్ధతు ఉన్నప్పుడే సీఎం పదవి అనేది తీసుకోవాలని, అయినా ఒకరిని అడిగి తీసుకోవడం కాదని, అది మనమే సంపాదించుకోవాలని, కనీసం గత ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లలో గెలిపించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు సీఎం సీటు ఇవ్వమని టిడిపి, బిజేపిలని ఎలా అడుగుతామని, అది ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే చర్చ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సీఎం సీటు పవన్ త్యాగం చేసినట్లే అని అర్ధమవుతుంది. కానీ […]
జగన్ ‘సీఎం’ యాగం.. మళ్ళీ గెలిచేస్తారా?
రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ..ఆరు రోజుల పాటు మహాయాగం నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. ఈ యాగం ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. ఇక నేడు యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభిస్తారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం […]