జనంలోనే జగన్..ముందస్తు స్కెచ్‌తోనే..!

ఇటీవల కాలంలో జగన్ ఎక్కువగా జనంలోనే ఉంటున్నారు. ఏదొక కార్యక్రమం పేరుతో భారీ సభలు పెడుతూ..ప్రజలతో మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకానికి బటన్ నొక్కడం గాని, లేదా ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి శంఖుస్థాపన చేయడం గాని..ఏదొక జిల్లాలో ఒక కార్యక్రమం పెట్టుకుని అక్కడ భారీగా జనాలని సమీకరించి సభ పెడుతున్నారు. అయితే సభకు భారీగా జనాలని సమీకరిస్తున్నారు.

వాలంటీర్లు, వైసీపీ నేతలు, సచివాలయ ఉద్యోగులు..జగన్ సభకు జనాలని రప్పించే కార్యక్రమాలని చేస్తున్నారు. అలా కాకుంస స్వచ్ఛందంగా ఎంతమంది జనం వస్తారో అంచాన్ వేయలేని పరిస్తితి. సరే ఏదేమైనా జగన్ సభలకు భారీగా జనం వస్తున్నారు. ఆ జనాలకు తానే మంచి చేశానని, గత చంద్రబాబు ప్రభుత్వంలో మంచి జరగలేదని, ఇక మళ్ళీ బాబు వస్తే..తాను చేసే పనులు ఆపేస్తారని, కాబట్టి ప్రజలంతా తనకు మద్ధతుగా ఉండాలని అడుగుతున్నారు. చంద్రబాబు, పవన్ కలిసి కుట్రలు చేస్తున్నారని, తనని గద్దె దించాలని చూస్తున్నారని, కాబట్టి ప్రజలు తనకు అండగా ఉండాలని కోరుతున్నారు.

ఇలా జగన్ ప్రజల్లో సెంటిమెంట్ లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలా ఎక్కువగా జగన్ భారీ సభలు నిర్వహించడానికి కారణాలు ఉన్నాయనే చెప్పాలి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది..అయినా ఇప్పటినుంచే జనంలో ఉంటున్నారంటే..దానికి కారణం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉండటమే అని అంటున్నారు. ఈ ఏడాది చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం..అందుకే జగన్ వరుసపెట్టి సభలు పెడుతున్నారు. ఏదొక పథకానికి బటన్ నొక్కడం, అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేస్తున్నారని తెలుస్తుంది. మరి జగన్ ముందస్తు ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Share post:

Latest