ప‌విత్రకు న‌రేష్ తొలిసారి ఎప్పుడు, ఎక్కడ‌, ఎలా ప్ర‌పోజ్ చేశాడో తెలుసా?

గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర.. జంటగా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్-పవిత్ర తమ ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రకు ఎప్పుడు, ఎక్కడ‌, ఎలా ప్ర‌పోజ్ చేశానో నరేష్ రివిల్ చేశారు.

న‌రేష్, ప‌విత్ర తొలిసారి `ఆలయం` సినిమా టైమ్ లో క‌లుసుకున్నార‌ట‌. హాయ్.. బై అన్న‌ట్లు వారి ప‌రిచ‌యం అయిందట‌. ఆ తర్వాత పదేళ్లకి `హ్యాపీ వెడ్డింగ్‌` సినిమా టైమ్ లో మ‌ళ్లీ కలుసుకున్నారట. ఆ స‌మ‌యంలో గళగళ మాట్లాడుతూ ప‌విత్ర న‌రేష్ ను బాగా ఎట్రాక్ట్ చేసింద‌ట‌. అప్పుడే వీరి మ‌ధ్‌య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డింది. `సమ్మోహనం` షూటింగ్ టైమ్ లో స్నేహం కాస్త ప్రేమ‌గా మారింది.

మొద‌ట న‌రేష్ ప‌విత్ర‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. `సమ్మోహనం` షూటింగ్ ఫినిష్ అవ్వ‌డంతో ప‌విత్ర వెళ్లిపోతుంది అని తెలుసుకున్న న‌రేష్‌.. ఈమె త‌న‌కు రైట్‌ పర్సన్‌ అనిపించి, డిన్నర్‌కి తీసుకెళ్లాడ‌ట‌. భోజనం చేశాక అక్క‌డే ప‌విత్ర‌కు `ఐ లవ్యూ` చెప్పాడట. కానీ, ఆమె `కీప్ లవ్వింగ్ మీ` అని బదిలిచ్చి వెళ్లిపోయింది. ఆ సమాధానం ఎలా తీసుకోవాలో న‌రేష్ కు అర్ధం కాలేద‌ట. నెక్స్ట్ డే షూటింగ్ సెట్ లోనే అంద‌రూ చూస్తుండంగా ప‌విత్ర‌ను ప‌క్క‌కు తీసుకెళ్లి నిల‌దీశాడ‌ట‌. అప్పుడు కూడా ఎస్ చెప్ప‌లేద‌ట‌. ఫైన‌ల్ గా డిసెంబర్‌ 31 రోజు కేక్‌, బొకే తీసుకొని న‌రేష్ ప‌విత్ర ఇంటికి విష్ చేసేందుకు వెళ్లాడ‌ట‌. ఇక ఆ రోజు ప‌విత్ర ఐ లవ్యూ అని చెప్పింద‌ట‌. అలా తమ లవ్‌ స్టోరీ సాగిందని తాజాగా న‌రేష్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Share post:

Latest