ఆ వర్గం ఓట్లపై బాబు ఫోకస్..జగన్ స్కెచ్.!

ఏపీలో నెక్స్ట్ గెలవడానికి ఇటు జగన్, అటు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ గద్దెనెక్కడమే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్‌కు చెక్ పెట్టి ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు అందివచ్చిన అవకాశాలతో రాజకీయం చేస్తూ ఎక్కడకక్కడ జగన్‌ని దెబ్బతీయాలని చూస్తున్నారు.

ఇదే క్రమంలో గత ఎన్నికల్లో జగన్ కు మద్ధతు తెలిపిన వర్గాలని టి‌డి‌పి వైపుకు తిప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు అన్నీ వర్గాలు జగన్ వైపే నిలిచాయి. ప్రధానంగా బీసీ, కాపు, ఎస్సీ, మహిళా, యువత, రైతు వర్గాలు జగన్‌కు మద్ధతు ఇచ్చాయి. కానీ ఈ సారి వారిని మార్చుకుని టి‌డి‌పికి మద్ధతు ఇచ్చేలా చేసుకుని సత్తా చాటడమే టార్గెట్ గా బాబు వెళుతున్నారు. ఎలాగో పవన్ తో పొత్తు ఉంటే కాపు ఓట్లు కలిసొస్తాయని బాబు చూస్తున్నారు. మిగిలిన వర్గాలని సైతం నిదానంగా తమ వైపుకు తిప్పుకుంటున్నారు.

ప్రధానంగా ఇప్పుడు రైతుల మద్ధతు దక్కించుకునేందుకు బాబు కష్టపడుతున్నారు. ఇటీవల అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా బాబు రోడ్డు ఎక్కిన విషయం తెలిసిందే. వారికి మద్ధతుగా పోరాటం చేస్తున్నారు. ఇక అలాగే వారిని వైసీపీకి యాంటీ చేస్తూ..టీడీపీకి పాజిటివ్ చేసుకునే పనిలో పడ్డారు.

ఇదే క్రమంలో బాబు ఎత్తులకు చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నారు. రైతులని బాబు ఎప్పుడు ఆదుకోలేదు అని, రుణమాఫీ చేస్తానని మోసం చేశారని, వ్యవసాయం దండగ అని అన్నారని చెబుతున్నారు. అయితే జగన్ ప్రభుత్వంలో కూడా రైతులకు ఒరిగింది ఏమి లేదు. ధాన్యం డబ్బులు రావడానికి నెలలు పడుతుంది. పంట నష్టం సరిగ్గా అందడం లేదు.

కొద్దో గొప్పో కొంతమేర రుణమాఫీ చేశారు..అది అందిన రైతులు చాలామంది ఉన్నారు. పూర్తి స్థాయిలో చేయకపోయిన, కొంతవరకు చేశారు. అటు ధాన్యం డబ్బులు వెంటనే పడేవి. కాబట్టి రైతులకు అన్నీ విషయాలు తెలుస్తాయి..కాబట్టి వారే పరిస్తితులని బేరీజు వేసుకుని ఎవరికి మద్ధతు ఇస్తారో చూడాలి.