ఆ స్టార్ క్రికెట‌ర్ న‌న్ను ఏడిపించాడంటూ షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టిన స‌మంత‌!

సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం కెరీర్‌ పరంగా య‌మా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన కోస్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి స్టార్ స్పోర్ట్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల‌ను పంచుకుంది. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు..? తాను ఏ టీమ్‌ కి సపోర్ట్ చేస్తాను..? వంటి విషయాలను పంచుకుంది.

ఈ క్రమంలోనే టీమిండియా ‌స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనను ఏడిపించాడంటూ షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టింది. విరాట్ కోహ్లీ తనకు స్ఫూర్తి అని చెబుతూ ఆయనకు సంబంధించిన ఒక కీలక ఘట్టాన్ని స‌మంత‌ ప్రస్తావించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ తన కంబ్యాక్ సెంచరీ(71వ సెంచ‌రీ) చేసినప్పుడు ఏడ్చేశాన‌ని చెప్పుకొచ్చింది.

విరాట్ చేసిన 71వ సెంచరీ చాలా స్పెషల్ అని.. ఫామ్ కోల్పోయి ముప్పేట దాడి జ‌రుగుతున్నా కోహ్లీ తిరిగి పుంజుకున్న తీరు అమోఘమని, అది నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. ఇక త‌న ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎంఎస్ ధోని అని తెలిపింది. అలాగే ఐపీఎల్ లో త‌న ఫేవ‌రెట్ టీమ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ అని.. ఆ జ‌ట్టుకే త‌న స‌పోర్ట్ అని పేర్కొంది. దీంతో స‌మంత కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest