పవన్ కళ్యాణ్ వదులుకున్న ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా చిత్ర పరిశ్రమ‌లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తన అన్న స్టార్ హీరోగా ఉన్న సరే దాన్ని పట్టించుకోకుండా తన టాలెంట్ ని నమ్ముకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తన నటన, మేనరిజమ్స్‌, స్టైల్ తో తన అన్నను మించిన అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్ గా టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా నిలిచాడు.

Pawan Kalyan interesting-Comments

పవన్ అభిమానులకు ఆయన సినిమా వస్తుందంటేనే ఓ పండుగ ఆ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన పాతకెళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. ఆ లిస్టులో కొన్ని ప్లాప్‌ సినిమాలు ఉంటే మరికొన్ని బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే పవన్ వదులుకున్న టాప్ 5 బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Idiot Movie Completed 20 Years: ఇరవై ఏళ్ళ 'ఇడియట్' - NTV Telugu

ఇడియ‌ట్‌ :
ఇడియ‌ట్ సినిమా కోసం పూరీ జ‌గ‌న్నాథ్ ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అనుకున్నాడు. అయితే కథ విన్నాక, ఈ సినిమాలో కొన్ని సీన్లను మార్చాల‌ని ప‌వ‌న్ అడిగాడు. పూరి కూడా మార్చాడు. కానీ, అవి పవన్ కి నచ్చలేదు. అలా ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సినిమా మిస్ అయ్యింది.

అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి :
అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి క‌థ‌ను కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోస‌మే రాశాడు పూరీ. కిక్ బాక్సింగ్ చుట్టూ తిరిగే ఈ కథ పవన్ కి నచ్చింది. కానీ ఆ సమయంలో డేట్స్ కుదరలేదు. దాంతో ర‌వితేజ‌గా వచ్చిన అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతోనే ర‌వితేజ‌కు మాస్ ఇమేజ్ ద‌క్కింది.

Athadu | Cinema Chaat

అత‌డు :
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఇష్టపడి రాసుకున్న కథ ఇది. సినిమాలో పార్ధు క్యారెక్ట‌ర్‌ కు ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ పవన్ కళ్యాణ్ కి ఈ కథ కనెక్ట్ కాలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ మ‌హేశ్ బాబు చేతిలోకి వెళ్లింది.

పోకిరి :
ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాల్సింది. డేట్స్ సెట్ అవ్వక మిస్ అయ్యింది. మ‌హేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ గా నిలిచిన ఈ సినిమా పవన్ కి పడి ఉంటే ఇంకా హిట్ అయ్యి ఉండేది.

Raviteja: జింతాత అంటూ మళ్లీ వస్తోన్న 'విక్రమార్కుడు' - 10TV Telugu

విక్రమార్కుడు:
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `విక్రమార్కుడు`కి ఫ‌స్ట్ ఛాయిస్ ప‌వ‌న్ క‌ళ్యాణే. క‌థ కూడా విన్న ప‌వ‌ర్ స్టార్.. ఇత‌ర ప్రాజెక్ట్‌ల కార‌ణంగా విక్ర‌మార్కుడును మిస్ చేసుకున్నాడు. క‌ట్ చేస్తే ర‌వితేజ న‌టించిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది.

ఇక తరుణ్ ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం ఆయ‌న తోలి సినిమా ‘నువ్వే కావాలి’. ఆరోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే ఈ సినిమాని ముందుగా చెప్పాల‌నివుంది అనే టైటిల్ తో ప‌వ‌న్‌, అమీషా పటేల్ తో మోద‌లుపెట్టారు. కానీ, ఏవో కార‌ణాల చేత్త ఆ సినిమా మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఆ త‌ర్వాత త‌రుణ్ ఈ సినిమా క‌థ‌లోకి రాగా.. ఆ త‌ర్వాత నువ్వే కావాలి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. మొత్తానికి ఈ బ్లాక్‌ బ‌స్ట‌ర్ సినిమాల‌ను పవన్ కి పడి ఉంటే.. పవన్ రేంజ్ ఊహించడం కూడా కష్టమే. ఆ స్థాయిలో ఉండేది.

Share post:

Latest