టీడీపీ మేనిఫెస్టో రెడీ..ఊహించని హామీలతో బాబు..!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేయలేని పరిస్తితి..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. అంటే తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరిగేలా ఈ ఏడాది చివరిలో ప్రభుత్వం రద్దు చేసి..ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుంది.

ఇక ముందస్తుపై ప్రతిపక్ష టీడీపీ రెడీ అవుతుంది. మొదట నుంచి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు గట్టిగానే చెబుతూ వస్తున్నారు. ఇటు టి‌డి‌పి శ్రేణులని సైతం ముందస్తు ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. ఇక ముందస్తుని దృష్టిలో పెట్టుకునే..అభ్యర్ధులని ఖరారు చేయడం, ఎన్నికల హామీలు ఇవ్వడం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో చంద్రబాబు తన పర్యటనల్లో భాగంగా ప్రజలకు ఊహించని హామీలు ఇస్తూ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోని సైతం రెడీ చేసినట్లు సమాచారం.

ప్రజల్ని ఆకట్టుకునే హామీలతో చంద్రబాబు..మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే మరో నాలుగు రోజుల్లో జరగనున్న మహానాడు కార్యక్రమంలో ఎన్నికల మేనిఫెస్టోలోని కొన్ని హామీలని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయి మేనిఫెస్టోని విజయదశమికి విడుదల చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

ఇక మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ మహానాడుతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు బాబు సిద్ధమవుతున్నారు. మహానాడు వేదికగా పలు హామీలని ఇవ్వడానికి బాబు రెడీ అయ్యారు. చూడాలి మరి టి‌డి‌పి మేనిఫెస్టో ఏ విధంగా ప్రజలని ఆకట్టుకుంటుందో.

Share post:

Latest