సూసైడ్ చేసుకోవాలనుకున్న పవిత్ర లోకేష్.. కాపాడింది ఎవరంటే..?

సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ కలిసి మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వీరిద్దరూ కలిసి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరి నిజజీవితంలో జరిగిన సంఘటనను పోలిన కథతోనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఈనెల 26వ తేదీన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో విడుదల కాబోతోంది.

Actor Naresh VK, Pavitra Lokesh, MS Raju's Telugu-Kannada bilingual film  Malli Pelli' / 'Matthe Madhuve' teaser unveiled | Telugu Movie News - Times  of India
తాజాగా నిన్నటి రోజున ఒక ఇంటర్వ్యూలో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ తన వ్యక్తిగత సంబంధించి విషయాలను తెలియజేసింది. తన కెరియర్ నుంచి క్యారెక్టర్ రోల్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టాను కానీ హీరోయిన్గా చేయాలని ఎప్పుడూ అనుకోలేదంటూ తెలిపింది. కెరియర్ మొదట్లో సుప్రసిద్ధ దర్శకుడు గిరీష్ కాసరవెల్లి తనను హీరోయిన్ చేసి రెండు సినిమాలు చేయడం తన అదృష్టమని ఆ తర్వాత తనకు వచ్చిన పాత్రలు చేసుకుంటూ వచ్చానని ఇప్పుడు మళ్లీ పెళ్లిలో ప్రధాన పాత్రలో నటించాలని తెలిపారు.

ఈ సినిమా కథ ఎమ్మెస్ రాజుగారు చెప్పినప్పుడు తాను నరేష్ కలిసి నటిస్తే బాగుంటుందని ఆయనే సలహా ఇచ్చారని తెలిపింది. ఈ సినిమా చూసి మీరు ఇది కథనా కల్పితమా అనేది తెలపాలని తెలియజేసింది పవిత్ర లోకేష్. తన జీవితంలో జరిగిన విషయాలను తెలియజేస్తూ తన విషయాన్ని కొంతమంది అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపించారు.. తన వ్యక్తిత్వం హనసం చేసి తన కెరియర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూసారు.. దీని నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డాను నేను ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నేను బయటికి వచ్చాను అంటే కారణం నరేష్.. నా వెనక చాలా బలంగా నిలబడ్డారు నేను ఉన్నానని చెప్పారు దేనికి భయపడలేదు నేను ఒక్క అడుగు వెనక్కి వేసిన పరిస్థితి దారుణంగా ఉండేది నరేష్ తనకు సపోర్టుగా నిలబడ్డారని తెలిపింది పవిత్ర లోకేష్.

Share post:

Latest