బాయ్ ఫ్రెండ్ పై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..!!

సిని ఇండస్ట్రీలో నటీనటుల గురించి పలు రూమర్స్ మీడియా లో బాగా వినిపిస్తూ ఉంటాయి.. ఇలా ఎంతోమంది సెలబ్రెటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా బయటపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక హీరో హీరోయిన్ ఏమైనా ఎఫైర్లు పెట్టుకున్నా అలాగే వారిద్దరు కలిసి తిరుగుతున్న మీడియా కంటికి పడితే మాత్రం వారిని వదిలిపెట్టరు. వారి విషయాలను వెంటనే వైరల్ గా చేస్తూ ఉంటారు.

Keerthy Suresh (Actress) Wiki, Height, Weight, Age, Boyfriend, Biography & More - Stars Biog

ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఒక వార్త గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతూనే ఉంది. మొన్నటికి కీర్తి సురేష్ ఎవరినో ప్రేమించిందని అలాగే ఆయన ఒక బిజినెస్మన్ అని తనతోనే పెళ్లి జరగబోతుందంటు వార్తలు తెగ వైరల్ గా మారాయి.. కీర్తి సురేష్ ఈ పెళ్లి వార్తలపై స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు.

అయితే తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఒక అబ్బాయి తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడం జరిగింది. అందులో వారిద్దరూ ఎల్లో కలర్ దుస్తులను ధరించిన ఫోటోని చూసిన వారందరూ ఈ ఫొటోలో ఉన్నది కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అని అందరూ ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేశారు. త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగబోతోంది అంటూ పలు వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించడం జరిగింది.

ఈ సందర్భంగా కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా ఈ ఫోటో గురించి స్పందిస్తూ ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ ఇతనిని కూడా మీరు వదిలిపెట్టరా ఎలాగైనా వార్తలు లోకి తీసుకువస్తారా? నా జీవితంలో నిజమైన మిస్టరీ మ్యాన్ ను తప్పకుండా పరిచయం చేస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి అంటూ కీర్తి సురేష్ కామెంట్స్ చేశారు. దీంతో క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest