ఆకట్టుకునే నటన, మైమరపించే అందం, అలరించే డాన్సులతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుని ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రంభ గురించి పరిచయాలు అవసరం లేదు, 15 ఏళ్లకే నటన వైపు అడుగులు వేసిన రంభ సౌత్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది, అగ్ర హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్‌ను సంపాదించుకుంది.
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రంభ 2010లో ఇంద్ర కుమార్ అనే కెనడాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు.. ఒక కుమారుడికి రంభ జన్మనిచ్చింది. వివాహం అనంతరం సినిమాలకు దూరమైన రంభ.. తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించింది.
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తరచూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన పెద్ద కూతురు లాన్య ఇంద్రకుమార్ కు సంబంధించిన పిక్స్ ను పంచుకుంది. ఈ పిక్స్ లో లాన్య అచ్చ తెలుగు ఆడపిల్లలా ముస్తాబై చేతిలో పలు బహుమతులు పట్టుకుని కనిపించింది. లాన్య అచ్చం తల్లి రంభ మాదిరిగా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. లాన్యను చూసిన నెటిజన్లు రంభ కూతురు ఇంత అందగత్తా అంటూ కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.
https://www.instagram.com/p/CsfN5XrrRjw/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==