ఆ ఎమ్మెల్యే దంపతులు టీఆర్ఎస్ లో ఇమడలేక పోతున్నారా.!

వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ‌, ముర‌ళీ దంప‌తుల పేరు చెపితే స‌మైక్య రాష్ట్ర రాజ‌కీయాల్లోనే తెలియ‌ని వారు ఉండ‌రు. కాంగ్రెస్‌లో లేడీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి వైఎస్ హ‌యాంలో మంత్రి అయ్యారు. వైఎస్‌తో సురేఖ దంప‌తుల‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. 2008లో ఆమె వైఎస్ సూచ‌న మేర‌కు హ‌న్మ‌కొండ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. త‌ర్వాత జ‌గ‌న్ వైసీపీలో చేరిన సురేఖ త‌న మంత్రి ప‌ద‌వి వ‌దులుకుని […]

రాహుల్ స‌భ‌లో ఆ సీనియ‌ర్ ఎక్క‌డ‌..!

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతాయో చెప్ప‌డం క‌ష్టం. ఉమ్మ‌డి రాష్ట్రంలో అందునా అటు వైఎస్ ప్ర‌భుత్వం, ఇటు కిర‌ణ్ కుమార్ ప్ర‌భుత్వంలో ఓ వెలుగు వెలిగి.. ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా పేరు ప‌డ్డ కాంగ్రెస్ సీనియ‌ర్ ద‌ళిత నేత దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌. ఇప్పుడు ఈయ‌నను కాంగ్రెస్ ఎందుకో దూరం పెడుతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రో రెండేళ్ల‌లో తెలంగాణ‌లో అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లు పొంచి ఉన్న స‌మ‌యంలో ద‌ళిత వ‌ర్గానికి చెందిన మాస్ లీడ‌ర్‌ను ఇలా దూరం పెట్ట‌డంపై […]

ఏపీ, తెలంగాణాలో ఇద్దరి చంద్రుల పరిస్థితి ఇదే!

ఏపీ, తెలంగాణ సీఎంల తీరు అత్త సొమ్ముకు అల్లుడి ప్ర‌చారం అన్న‌ట్టుగా ఉంది. ఏపీని దేశంలోనే ఫ‌స్ట్ స్టేట్ చేస్తాన‌ని ఇక్క‌డి సీఎం చంద్ర‌బాబు.. తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేస్తాన‌ని కేసీఆర్ ఇద్ద‌రూ ఒక‌రిని మించి ఒక‌రు ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్ర‌భుత్వం సొమ్మును త‌మ ఇష్టానుసారం ఖ‌ర్చు చేసేస్తున్నారు. పైగా ఆ ఖ‌ర్చును వాళ్ల సొంత జేబుల్లోంచి చేసిన ఖ‌ర్చుగా వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు. ఏపీలో చంద్ర‌బాబు గ‌త పాల‌న‌కు ఇప్ప‌టికీ […]

టీఆర్ఎస్ లో కండువా రచ్చ

గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఇద్దరు ఎంపీల్లో ఒకరైన గుత్తా సుఖేందర్ రెడ్డి… ఆ తరువాత టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. తనతో పాటు మిర్యాలగూడ ఎంపీని సైతం ఆయన టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తనపై వేటు పడుతుందనే ఉద్దేశమో ఏమో తెలియదు కానీ… ఒక్క విషయంలో మాత్రం ఆయన మరీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో చేరే సమయంలోనూ ఆ […]

కాంగ్రెస్ సభ ఎఫెక్ట్… పెరిగిన జగ్గారెడ్డి ఇమేజ్ 

అంతకుముందు వరకు ఆయనను కాంగ్రెస్ లో ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకున్నా… ఆయన తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర బలంగా ఉండేది. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన జగ్గారెడ్డి… మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. కానీ సంగారెడ్డిలో భారీ సభను ఏర్పాటు చేసి సక్సెస్ సాధించిన తరువాత జగ్గారెడ్డి […]

టీటీడీపీలో మ‌రో ఎమ్మెల్యే జంప్‌..?

రుణ శేషం..శత్రు శేషం ఉండరాదనేది ఓ నానుడి. ఇదే విధానాన్ని తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో టీడీపీనీ కోలుకోలేని దెబ్బ‌తీసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీకి మిగిలిన ఎమ్మెల్యేల‌ను కూడా త‌మ పార్టీలోకి లాక్కునేందుకు మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ప్లాన్ వేసింద‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణ‌లో టీడీపీని దాదాపు ఖాళీ చేసేసిన గులాబీ పార్టీ తాజాగా అక్క‌డ ప‌సుపు పార్టీని అంద‌రూ మ‌ర్చిపోయేలా చేసే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు […]

తెలంగాణ భూ కుంభ‌కోణంలో కేసీఆర్ మంత్రి

తెలంగాణ‌లో భూ అక్ర‌మార్కులు చెల‌రేగార‌ని, సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతిలో ఆరితేరిపోయి.. అడ్డ‌గోలుగా స‌హాయం చేశార‌ని వార్త‌లు అందాయి. ఈ వ్య‌వ‌హారంలో టీ మంత్రుల హ‌స్తం కూడా ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో తీవ్రంగా ఫైరైన సీఎం కేసీఆర్‌.. వెంట‌నే ఏసీబీని రంగంలోకి దింపారు. అస‌లు విష‌యం ఏంటో అంతు తేల్చాల‌ని ఆదేశించారు. దీంతో ఇప్ప‌టికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు. అధికారులు భారీ ఎత్తున ఆస్తులు కూడ‌బెట్టార‌ని, అవినీతిలో పేట్రేగిపోయార‌ని […]

వాళ్లను వదలేసి తప్పుచేశాం… టీ-బీజేపీలో అంతర్మధనం

తెలంగాణలో బీజేపీకి ఐదుగురంటే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీలోకి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్లెవరు చేరలేదు. అయితే ఈ విషయంలో తాము ముందుగా మేల్కొని ఉంటే… టీఆర్ఎస్ చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే చేరి ఉండేవాళ్లని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా కామనైపోయాయని… కానీ ఈ విషయంలో తాము చాలా ఆలస్యంగా మేల్కొన్నామని టీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కంటే ముందుగానే టీడీపీకి చెందిన […]

తెలంగాణ మీడియాలో టీడీపీకి ఇంపార్టెన్స్ లేదా..!

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాక‌పోయినా.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి.. గ‌త కొన్నాళ్లుగా మ‌రింత దూకుడుగా ఉన్నాడు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వాడి వేడిని మ‌రింత పెంచారు. ఇటీవ‌ల ముగిసిన మ‌హానాడు త‌ర్వాత ఈ వాడి మ‌రింత పెరిగింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌డు ప్ర‌ధాన స‌మ‌స్య‌.. టీడీపీకి మీడియా క‌వ‌రేజ్ ఘోరంగా త‌గ్గిపోయింద‌ట‌! తమ ప‌క్షానే ఉంటాయ‌ని భావించిన ఆ రెండు ప‌త్రిక‌లు […]