సభకు నేను రాలేను బాస్.. గోవా వెళుతున్నా..

ఇటీవల ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సక్సస్ కావడంతో ఇబ్రహీంపట్నంలో కూడా నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ ను విమర్శిస్తూ దూకుడు పెంచింది. అయితే రేవంత్ లీడర్షిప్ లో సభలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హాజరుకాకుండా తమ అసంత్రుప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. ఇపుడు ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డికే ఫోన్ […]

అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..

ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. […]

గులాబీ పార్టీలో ప్రవీణ్ గుబులు..!

ఐపీఎస్ అధికార పదవిని వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీఎస్పీలోకి అట్టహాసంగా చేరారు. ఆ రోజే.. ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు. ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు గానీ నామమాత్రంగానే.. ఐపీఎస్ చదివిన మేధావిని ఎలా ఎదుర్కోవాలనే విషయం టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు పార్టీలో ఉన్న దళిత […]

ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!

భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని ఎప్పుడూ ఆ నాయకులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుంది. అందుకు నిదర్శనమే ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రలు. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రజాదీవెన యాత్ర : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]

కేసీఆర్ పొలిటికల్ స్టెప్.. ఊహించని ట్విస్ట్

దళితబంధు.. కేసీఆర్ మానసపుత్రిక..ఈనెల 16న హుజూరాబాద్ లో ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు.. అందరూ ఆశ్చర్యపోయేలా బుధవారమే ప్రారంభించారు.. దళిత బంధును ఆయన దత్తత గ్రామంలోనే ప్రారంభించారు. ఈనెల 16న జరిగే కార్యక్రమం కేవలం లాంఛనమే అని.. అధికారికంగా వాసాలమర్రిలోనే ప్రారంభమైందని నేరుగా సీఎమ్మే కుండబద్దలు కొట్టారు. ఉన్నట్టుండి సీఎం ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాదు.. ఆ డబ్బు (రూ.10 లక్షలు) బుధవారమే వారి అకౌంట్లలో వేస్తామని చెప్పారు. దీంతో ఆ గ్రామంలోని […]

కేసీఆర్ సార్.. ఇదేం విచిత్రం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుది  నేనింతే అన్నట్టుంది వ్యవహారం. నేను అనుకున్నది చేస్తా.. నాకు నచ్చినట్టు చేస్తా.. నచ్చకపోతే అంతే.. అని ఆయన చెప్పకపోయినా..చేస్తున్న పనులు మాత్రం నా ఇష్టం అన్నట్లుంది. దీనికి ఉదాహరణ ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలే.. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే.. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. . ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే […]

కెసిఆర్,జగన్ లకు కేంద్రం ఝలక్ ..!

మంగళవారం (ఈరోజు) పార్లమెంటులో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు నిరాశ ఎదురైనట్లయింది. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153 చేయాలని, ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సమాధానమేంటని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో 2026లో జరిగే జనాభా […]

బండి స్పీడ్ కు గండి పడిందా.. గండి కొట్టారా..

జేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్  స్పీడ్ కు పార్టీలో కళ్లెమేశారా? కిషన్ వర్సెస్ సంజయ్ పోరులో కిషన్  రెడ్డే పైచేయి సాధించారా? బండి సంజయ్ ప్రారంభించే యాత్ర అందుకే వాయిదా పడిందా? అనే ప్రశ్నలు ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. కేసీఆర్ ను తిడుతూ మీడియాలో నానే రాష్ట్ర బీజేపీ చీఫ్ ఇపుడు సైలెంట్ కావడంతోపాటు ఈనెల 9న చేపట్టనున్న పాదయాత్ర 24కు వాయిదా వేసినట్లు పార్టీ తెలిపింది. పార్లమెంటు సమావేశాల కారణంగా యాత్ర వాయిదా […]

హుజూరాబాద్ కారు బెర్త్ ఎవరికో.. అధినేత మదిలో ఏముందో..?

రోజు రోజుకూ హుజూరాబాద్ ఉప ఎన్నికల చర్చ జోరందుకుంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ఎలాగైనా తమ వశం చేసుకోవాలని కేసీఆర్ శపథం పూనారు. పొరపాటున అక్కడ కారు వెనకబడిందో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే ఎన్నికల్లో విజయం సాధించడానికి కేసీఆర్ దళిత బంధు స్కీం ప్రకటించారు. ఈ పథకంపై ఎవరూ విమర్శించడం లేదు కానీ.. ఇదే స్పీడ్ లో రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే […]