ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]
Tag: Telangana
పవన్ పార్టీపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..జన సైనికులు ఫైర్!
బండ్ల గణేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన నిర్మాతగానూ టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. అయితే ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే బండ్ల.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్‌కు పరమ భక్తుడు. స్టేజ్ ఎక్కితే చాలు పవన్‌ను ఆకాశానికి ఎత్తేసే బండ్ల.. తాజాగా ఆయన పార్టీ ఆయిన జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల..తెలంగాణాలో జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించాడు. ఆయన మాట్లాడుతూ..ఏపీలో […]
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ..సైడైన నాగార్జున..కారణం అదేనట?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారికి జగన్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబర్ 4న సినీ పెద్దలు జగన్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జరగనున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి […]
తెలంగాణ సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు..స్కూళ్ల రీ ఓపెన్‌పై స్టే!
తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పాఠశాలల, కళాశాలల పున:ప్రారంభంపై స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పాఠశాలలను తిరిగి తెరవడానికి వ్యతిరేకంగా గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటీషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై మంగళవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా..ప్రత్యక్ష […]
కేసీఆర్ అలా చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా
తెలుగుదేశం పార్టీలో ఉండి.. అక్కడ ఇమడలేక.. బీజేపీలో చేరి ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఇపుడు కేసీఆర్ కు మద్దతు పలుకుతున్న మోత్కుపల్లి నరసింహులు ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఇటీవల దళిత బంధు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేద దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకంపై విమర్శలు రాకున్నా.. రాష్ట్రమంతా అమలు చేయాలి అనే డిమాండ్ ఊపందుకుంది. దళితులకు […]
ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?
ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు […]
లీడర్స్ ఫ్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ..కమలంలో మరో గ్రూప్..
తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు. […]
మల్లన్నను రామన్న సమర్థిస్తున్నట్లుందే..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వాడిన పదజాలాన్ని మంత్రి, టీ కేటీఆర్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని నేరుగా సమర్థించకుండా దాదాపు సమర్థిస్తున్నట్లే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన […]
’ఓటుకు నోటు‘ కేసు.. రేవంత్ కు కోర్టు సమన్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శనివారం నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. అక్టోబర్ 4న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ తోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, వేంక్రిష్ణ కీర్తన్ లకు సమన్లు పంపింది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలోఉన్నపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేశారని కేసు నమోదైంది. ఈడీ నమోదు చేసిన ఈకేసు […]